|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం సృష్టిస్తున్న ధురంధర్‌: జవాన్‌ రికార్డులు బద్దలు.. బాలీవుడ్‌లో కొత్త చరిత్ర!

Published: 03-01-2026, 1:30 PM
సంచలనం సృష్టిస్తున్న ధురంధర్‌: జవాన్‌ రికార్డులు బద్దలు.. బాలీవుడ్‌లో కొత్త చరిత్ర!
  • ‘ధురంధర్‌’ 30 రోజులు పూర్తి చేసుకుని కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
  • 30వ రోజున ₹10 కోట్లకు పైగా వసూలు చేసి తన జోరు కొనసాగించింది.
  • జవాన్‌ రికార్డులను బ్రేక్ చేసి బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
  • ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లు, ఇండియాలో ₹804 కోట్లు కలెక్ట్ చేసింది.

రణ్‌వీర్‌ సింగ్ ‘ధురంధర్‌’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 30 రోజుల్లోనే షారూఖ్ ‘జవాన్‌’ రికార్డులను బద్దలు కొట్టి, బాలీవుడ్‌లో నెం 1 చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లు, ఇండియాలో ₹804 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది.

30 రోజుల్లో ధురంధర్‌ వసూళ్ల సునామీ

రణ్‌వీర్‌ సింగ్‌, అక్షయ్ ఖన్నా నటించిన `ధురంధర్‌` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. అదిత్య ధార్‌ రూపొందించిన ఈ మూవీ విడుదలై నెల రోజులు అవుతున్నా, బాక్సాఫీసు వద్ద జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని బాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసిన ఈ మూవీ ఇప్పుడు సరికొత్త సంచలనం దిశగా వెళ్తోంది.  ఇప్పటికీ డబుల్‌ డిజిట్‌ నెంబర్‌ కలెక్షన్లు వస్తుండటం విశేషం.

`ధురంధర్‌` మూవీ 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 30వ(శనివారం) రోజు కూడా పది కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. రాత్రి 9గంటలకు వరకు ఈ లెక్క. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.  ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1200కోట్లు దాటింది. ఇండియాలోనే ఈ మూవీ ఏకంగా రూ.800కోట్లు దాటడం విశేషం.  29వ రోజుకి రూ.794కోట్లు రాగా, 30వ రోజుకి రూ.804కోట్లు వసూలు చేసింది.

జవాన్‌ రికార్డులు బ్రేక్.. బాలీవుడ్‌లో టాప్

`ధురంధర్‌` మూవీ ఇప్పుడు సరికొత్త సంచలనం సృష్టించింది. ఇండియా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది `జవాన్‌` వసూళ్లని బ్రేక్‌ చేసింది. లైఫ్‌ టైమ్‌ వసూళ్లతోపాటు, ఇండియా వసూళ్ల పరంగానూ షారూఖ్‌ ఖాన్‌ `జవాన్‌`ని దాటేసింది `ధురంధర్‌`. ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా `జవాన్‌` నిలిచింది. ఆ రికార్డులను రణ్‌వీర్‌ సింగ్‌ మూవీ బద్దలు కొట్టడం విశేషం. `జవాన్‌` కి ఇండియాలో రూ.761కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.1150కోట్లు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో ధురంధర్‌ కలెక్షన్లు

బాలీవుడ్‌ సినిమాల అన్ని రికార్డులను బ్రేక్‌ చేసిన `ధురంధర్‌` ఇప్పుడు ఇండియా వైడ్‌గా అన్ని భాషల చిత్రాలతో పోల్చితే అత్యధిక వసూళ్లని రాబట్టిన నాల్గో మూవీగా నిలిచింది.  ఇండియాలో అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రాలుగా `బాహుబలి 2`, `పుష్ప 2`, `కేజీఎఫ్‌ 2` ఉన్నాయి.  వీటి తర్వాత నాల్గో స్థానంలో ఇప్పుడు `ధురంధర్‌` చేరింది. మున్ముందు ఇది `కేజీఎఫ్‌` రికార్డులు కూడా బ్రేక్‌ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇంతటి సంచలనంగా మారిన ఈ మూవీ కేవలం రూ.225 కోట్ల బడ్జెట్‌తో రూపొందడం విశేషం.

₹225 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘ధురంధర్‌’ అంచనాలకు మించి విజయం సాధించింది. జవాన్‌ రికార్డులను అధిగమించి బాలీవుడ్‌లో నెం 1 చిత్రంగా నిలిచింది. ఇండియాలో టాప్ 4లో చేరిన ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.