|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ ‘ధురంధర్ రివేంజ్’: గూఢచర్యం, ఉగ్రవాదం! టీజర్ చూస్తే షాక్!

Published: 03-02-2026, 3:05 AM
రణ్‌వీర్ 'ధురంధర్ రివేంజ్': గూఢచర్యం, ఉగ్రవాదం! టీజర్ చూస్తే షాక్!
  • రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మొదటి భాగం 2025లో విడుదలై భారీ విజయం సాధించింది.
  • ‘ధురంధర్ ది రివేంజ్’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
  • ఈ సినిమాలో రణ్‌వీర్ గూఢచారిగా, అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించారు.
  • ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసింది.

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ధురంధర్: ది రివేంజ్’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

‘ధురంధర్ ది రివేంజ్’ టీజర్ విడుదల

Dhurandhar The Revenge Teaser: ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన్ పాత్రలో వచ్చిన ధురంధర్ ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిందే. తాజాగా ‘ధురంధర్: ది రివేంజ్ ’ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ధురంధర్ మొదిటి భాగం కేవలం హిందీలా మాత్రమే వస్తే ధురంధర్ ది రివేంజ్ పాన్ ఇండియా భాషలు అన్నింటిలోనూ విడుదలవుతుంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా దాదాపు ఇండియాలో రూ.1000 కోట్లకు పైగా  వసూలు చేసింది. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ధురంధర్ ది రివేంజ్ కోసం రణ్ వీర్ సింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘ధురందర్’ మొదటి భాగం 2025 డిసెంబర్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ముగింపులోనే మేకర్స్ రెండో భాగం ‘రివెంజ్’ గురించి మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ దృష్ట్యా, మార్చి 19న విడుదలయ్యే ఈ సీక్వెల్‌పై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read also- Varanasi Shooting : ‘ వారణాసి ‘ షూటింగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే..?

మొదటి భాగం విజయం

‘ధురంధర్’ ఒక హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అంతం చేసేందుకు వెళ్ళిన ఒక భారతీయ గూఢచారి కథ ఇది. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1,300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో గూఢచారిగా రణ్‌వీర్ యాక్టింగ్, విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ‘ధురంధర్ ది రివేంజ్’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సెకండ్ పార్ట్‌ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు

Read also- ENE 2: ఈ నగరానికి ఏమైంది?2 నుండి తప్పుకున్న సుశాంత్.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ఈ చిత్రం మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, ‘ధురంధర్ ది రివేంజ్’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.