|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్ విధ్వంసం! ‘ధురంధర్ 2’తో బాలీవుడ్ షేక్.. రికార్డులన్నీ బ్రేక్!

Published: 22-03-2026, 3:35 AM
రణ్‌వీర్ సింగ్ విధ్వంసం! 'ధురంధర్ 2'తో బాలీవుడ్ షేక్.. రికార్డులన్నీ బ్రేక్!
  • రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘ధురంధర్ 2’ సంచలనం!
  • మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల రికార్డు!
  • భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆదిత్య ధర్ దర్శకత్వం అదుర్స్!
  • నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో భారీ వసూళ్లు!

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణ్‌వీర్ సింగ్ సునామీ సృష్టించాడు. ‘ధురంధర్ 2’ సినిమాతో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

500 కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్ 2’ రికార్డు

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ (Director Aditya Dhar,), స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. పార్ట్ 1 థియేటర్లలో ఉండగానే పార్ట్-2ను ‘ధురంధర్- రివేంజ్’ (‘Dhurandhar- Revenge’) పేరుతో కేవలం 3 నెలల్లోని సినిమాని తీసి దాదాపు నాలుగు గంటల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ధురంధర్ 2 మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

సాక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడమే కాకుండా, అతి తక్కువ సమయంలో ₹500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దర్శకుడు ఆదిత్య ధర్ తన గత చిత్రం ‘ఉరి’ మ్యాజిక్‌ను మించిపోయేలా ఈ స్పై థ్రిల్లర్‌ను అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు.

సౌత్ మార్కెట్‌లో దుమ్ము దులుపుతున్న ‘ధురంధర్ 2’

థియేటర్లలో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ లభిస్తుండటంతో వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా జోరు తగ్గేలా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో కూడా ‘ధురంధర్ 2’ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్‌తో రణవీర్ సింగ్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రపంచవ్యాప్తంగా నిరూపించుకున్నారు. అలాగే బాలీవుడ్‌లో కొత్త బాక్సాఫీస్ కింగ్ తానేనని నిరూపిస్తూ.. ‘ధురంధర్ 2’ ధాటికి పాత రికార్డులన్నీ ఒక్కొక్కటిగా గల్లంతవుతున్నాయి.

దురంధర్ 2 సక్సెస్ తో రణవీర్ సింగ్ తన సత్తా చాటాడు. బాలీవుడ్ లో కొత్త బాక్సాఫీస్ కింగ్ గా నిరూపించుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.