|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేను క్షమాపణలు కోరుతున్నాను.. దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు

Published: 15-06-2025, 11:01 AM
నేను క్షమాపణలు కోరుతున్నాను.. దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, కొన్ని చిన్న లోపాలకు క్షమాపణలు కోరారు.

Key Points

1

తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది.

2

దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

4

చిన్న చిన్న లోపాలకు క్షమాపణలు కోరారు దిల్ రాజు.

గద్దర్ అవార్డుల వేడుక విజయవంతం

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్క్షతలు తెలియజేయడానికి ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా.. దిల్‌ రాజు (Dil Raju)మాట్లాడుతూ ‘‘తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుకను బిగ్‌ ఈవెంట్‌గా నిర్వహించి సక్సెస్‌ చేశాం. ఆర్నెల కృషితో నిన్న ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాం. తెలంగాణ గద్దర్‌ అవార్డ్స్‌ కమిటిని వేసుకుని అన్ని రూల్స్‌, రెగ్యులేషన్‌ పాటించి ఈ అవార్డులను అందజేశాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి అవార్డులను ఇవ్వాలని అనుకుని 2014 నుంచి 2023 వరకు ఎంపికైన ఉత్తమ చిత్రాలకు, 2024లో ఉత్తమ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశాం. పారదర్శకంగా సినిమాలను, టెక్నిషియన్స్‌ను అవార్డును ఎంపిక చేశాం. ఈ అవార్డుల వేడుకను బాధ్యతగా తీసుకున్నాం.

దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

నిన్న అవార్డు ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా సక్సెస్‌ఫుల్‌గా జరిగినందుకు ఆనందంగా ఉంది. అవార్డు ఫంక్షన్‌ జరిగిన విధానం పై మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్లందరికి ఎఫ్‌డీసీ తరపున నా ధన్యవాదాలు. ఈ సందర్బంగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy) గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గారికి నా థ్యాంక్స్‌. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం గారు ఈ వేడుక కోసం రెండున్నర గంటల పదిహేను నిమిషాలు కేటాయించారు. మొదట్లో గంట అనుకున్నారు. అయితే నా రిక్వెస్ట్‌ ప్రకారం రెండున్నర గంటలకు పైగా ఉండి, అందరికీ అవార్డులు అందజేశారు.

క్షమాపణలు కోరిన దిల్ రాజు

సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, ఎక్కడా ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా ఆ వేడుకకు వచ్చి అవార్డ్‌ తీసుకోవాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డ్‌ వస్తే స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్‌. ఇక ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే, వాళ్లు బాధపడి ఉంటే వాళ్లకు ఎఫ్‌డీసీ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఈవెంట్‌ అయిన తరువాత అందరూ అప్రిషియేట్‌ చేశారు, ప్రభుత్వం నుంచి రిపోర్ట్స్‌, బయటి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ చాలా పాజిటివ్‌గా ఉంది’ అన్నారు.

తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగిందని, భవిష్యత్తులో ప్రభుత్వ అవార్డులను గౌరవంగా స్వీకరించాలని దిల్ రాజు కోరారు. చిన్న లోపాలకు క్షమాపణలు కోరుతూ ముగించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.