
ప్రభుత్వం నుండి అవార్డులు వస్తున్నాయంటే వాటిని స్వీకరించడం మనందరి బాధ్యత అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఎంత బిజీగా ఉన్నా, అవార్డుల వేడుకకు హాజరు కావాలని ఆయన కోరారు.
Key Points
ప్రభుత్వ అవార్డులు స్వీకరించడం గ్రహీతల బాధ్యత.
ఎన్ని షూటింగ్స్ లో బిజీగా ఉన్నా, అవార్డులకు హాజరు కావాలి.
అవార్డుల వేడుక కోసం ఆరు నెలలు కష్టపడ్డారు.
తెలంగాణ సీఎం, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ అవార్డుల ప్రాముఖ్యత
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం నుండి అవార్డు వస్తోందంటే దాన్ని స్వీకరించడం గ్రహీతల బాధ్యత అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఎక్కడ ఉన్నా అవార్డు ఇచ్చే సమయానికి అందుబాటులో ఉండాలని కోరారు. త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులను ప్రకటిస్తుందని అన్నారు. టాలీవుడ్ కు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అని చెప్పారు. ఎన్ని షూటింగ్స్ లో బిజీ ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుండి అవార్డులు వస్తున్నాయంటే వెళ్లి స్వీకరించాలని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరికీ ఇది రిక్వెస్ట్ అని, అర్థం చేసుకోవాలని అన్నారు. అవసరం అయితే అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ డైరీలో రాసుకుని షూటింగ్ కు బ్రేక్ తీసుకోవాలని చెప్పారు. అవార్డుల వేడుక కోసం ఆరు నెలలు కష్టపడ్డామని అన్నారు. ప్రతి కేటగిరికీ కమిటీలు వేశామని తెలిపారు. తెలంగాణలో అవార్డుల ఫంక్షన్ నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ బాధ్యత
కృతజ్ఞతలు
చివరగా, దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అందించే గౌరవాన్ని గుర్తించి, అవార్డులను గౌరవంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.


