|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ సినిమా చేయకుండా ఉండాల్సింది.. తప్పు చేశానంటూ దిల్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)

Published: 24-06-2025, 3:31 AM
రామ్ చరణ్ సినిమా చేయకుండా ఉండాల్సింది.. తప్పు చేశానంటూ దిల్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)

రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంపై దిల్ రాజు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సినిమా నిడివి, తన నిర్ణయాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Key Points

1

దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

2

సినిమా నిడివి ఎక్కువగా ఉండటాన్ని దిల్ రాజు విమర్శించారు.

4

దర్శకుడితో ఎక్కువ జోక్యం చేసుకోలేకపోవడం తన తప్పు అని దిల్ రాజు అంగీకరించారు.

దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’(Game Changer). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ విషయంపై దిల్ రాజు(dil raaju) ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

గేమ్ చేంజర్ సినిమాపై విమర్శలు

‘‘ఈ సినిమాను నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్‌తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం. అయితే రోజూ కిచిడీ ఉంటుంది రోజు కావాలా. మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవడం మంచిది. అయితే తప్పు జరిగినప్పుడు దానిని నిర్మాత ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా ఫస్ట్ రాంగ్ స్టెప్ అదే. అలాంటి ప్రాజెక్ట్‌ను నేను చేసి ఉండకూడదు.

నిర్మాతగా దిల్ రాజు అనుభవం

నా కెరీర్‌లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. పెద్ద దర్శకుడితో చేసేటప్పుడు ముందే కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి కానీ నేను అలా చేయలేకపోయాను. అది నేను చేసిన తప్పు. అందుకే దానిని అక్కడితో వదిలేశాను. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతవ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ఈ కామెంట్స్ ‘గేమ్ ఛేంజర్’ గురించే చేశాడని అంటున్నారు.

చివరగా, దిల్ రాజు తన నిర్ణయాలపై విచారం వ్యక్తం చేయడం గమనార్హం. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడతానని ఆయన ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.