|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dil Raju – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గారు తిడితే పడతాం.. తప్పేముంది.. దిల్ రాజు కామెంట్స్..

Published: 26-05-2025, 7:44 AM
Dil Raju – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గారు తిడితే పడతాం.. తప్పేముంది.. దిల్ రాజు కామెంట్స్..

ఇటీవల థియేటర్స్ వివాదం రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ కోపం, తమ మధ్య సంబంధం గురించి వివరించారు.

Key Points

1

థియేటర్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు.

2

దిల్ రాజు, పవన్ కళ్యాణ్ మధ్య 22 ఏళ్ల పరిచయం ఉంది.

4

సినిమాకు నెగిటివిటి వస్తుందనే ప్రచారం తప్పు అని దిల్ రాజు అన్నారు.

థియేటర్స్ వివాదం

Dil Raju – Pawan Kalyan : ఇటీవల నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ జరుగుతుండగా ఆ వివాదం కాస్త పెద్దది అయి ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లడం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనతో సినీ పరిశ్రమపై, థియేటర్స్ ఇష్యూపై సీరియస్ అవ్వడం జరిగాయి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దీంతో నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు ఈ ఇష్యూ గురించి మీటింగ్ పెట్టారు.

పవన్ కళ్యాణ్ స్పందన

ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అనేదానికి దిల్ రాజు స్పందిస్తూ.. ఒకవేళ కళ్యాణ్ గారికి కోపం వస్తే ఆయన పెద్దన్న తిడతారు పడతాం. ఈ ఘటనతో ఆయన నిజంగానే హర్ట్ అయ్యారు. ఆయన ఒకవేళ తిడితే పడతాం. దాంట్లో తప్పేముంది. కళ్యాణ్ గారిని నేను 22 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన కోపం కూడా నాకు తెలుసు. ఆయనకు కోపం వచ్చేలా జరిగింది కాబట్టే ఆయన సీరియస్ అయ్యారు. కానీ ఆయన సినిమాకు నెగిటివిటి చేయడానికి ఇదే జరిగింది అనే ప్రచారం తప్పు అని అన్నారు.

దిల్ రాజు కామెంట్స్

థియేటర్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందనకు దిల్ రాజు స్పష్టీకరణ ఇస్తూ, పవన్ కళ్యాణ్ కోపానికి కారణమైన విషయాలను వివరించారు. ఈ వివాదం సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.