|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dil Raju Wife : ఖుషి నుంచి ‘పవన్ కళ్యాణ్’ ఫ్యాన్.. ‘వకీల్ సాబ్’ రిలీజయ్యాక వెళ్లి కలిస్తే.. ఏమని మాట్లాడారంటే..

Published: 28-06-2025, 7:49 AM
Dil Raju Wife : ఖుషి నుంచి ‘పవన్ కళ్యాణ్’ ఫ్యాన్.. ‘వకీల్ సాబ్’ రిలీజయ్యాక వెళ్లి కలిస్తే.. ఏమని మాట్లాడారంటే..

దిల్ రాజు భార్య తేజస్విని ఇటీవల ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమాని అని, ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత ఆయనను కలిసిన విషయాన్ని తెలియజేశారు.

Key Points

1

దిల్ రాజు భార్య తేజస్విని పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని

2

‘ఖుషి’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిని అని తెలిపారు

4

‘వకీల్ సాబ్’ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా గురించి మాట్లాడారు

తేజస్విని – పవన్ కళ్యాణ్ అభిమాని

Dil Raju Wife : సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తేజస్విని మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు ఖుషి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. వకీల్ సాబ్ సినిమా మా నిర్మాణ సంస్థలోనే తెరకెక్కింది. వకీల్ సాబ్ షూటింగ్లో చూసాను. అప్పుడు ఒక ఫ్యాన్ గా చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. పవన్ గారి స్మైల్ నాకు చాలా ఇష్టం. అప్పుడు కలిసి మాట్లాడదాం అనుకుంటే పవన్ గారి బిజీ వాళ్ళ కుదరలేదు.

‘వకీల్ సాబ్’ షూటింగ్ మరియు అనంతరం

వకీల్ సాబ్ రిలీజ్ అయ్యాక నేను, రాజు గారు వెళ్లి కలిసాము. సినిమా గురించి మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారితో. ఆయన.. మీరు నా ఆడబిడ్డ, సినిమా గురించి బాగా చెప్పారు అని అన్నారు. చాలా మంచి పర్సన్. ఆయన మంచి మనసుతో మాట్లాడతారు. మీరేమన్నా ఆయనకు సమస్యలు చెప్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ సమస్యని చూస్తారు. సమస్యలు ఉన్నవాళ్లకు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు అని తెలిపింది.

పవన్ కళ్యాణ్ తో తేజస్విని సంభాషణ

తేజస్విని పవన్ కళ్యాణ్ గారి గురించి తన అభిమానాన్ని, వారితో కలిసి మాట్లాడిన అనుభవాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ మంచి మనసున్న వ్యక్తి అని ఆమె అభిప్రాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.