|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరో వివాదంలో డింపుల్ హయతి , ఇంట్లో పనివారిని టార్చర్ చేసిన స్టార్ హీరోయిన్?

Published: 30-09-2025, 8:18 AM
మరో వివాదంలో డింపుల్ హయతి , ఇంట్లో పనివారిని టార్చర్ చేసిన స్టార్ హీరోయిన్?

నటి డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకుంది. పెంపుడు కుక్కల సంరక్షణ కోసం నియమించిన పనివారిని ఆమె వేధించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఒక మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాదం ఆమె పెళ్లిపై కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

Key Points

1

డింపుల్ హయతి మళ్ళీ వివాదంలో చిక్కుకుంది.

2

పెంపుడు కుక్కల సంరక్షణ కోసం నియమించిన పనివారిని వేధించిందని ఆరోపణలు.

4

డింపుల్ పెళ్లి, ఆమె భర్త గురించి నెటిజన్లలో కొత్త ప్రశ్నలు తలెత్తాయి.

మరో వివాదంలో డింపుల్ హయతి

కొన్నాళ్ల క్రితం ఓ ఐపీఎస్ అధికారితో పార్కింగ్ విషయంపై తలెత్తిన వివాదంలో పెద్ద దుమారమే రేపిన డింపుల్ హయాతి, అప్పటినుంచి ఎక్కువగా సినిమాల్లో కనిపించడంలేదు. అవకాశాలు కూడా రావడంలేదని తెలుస్తోంది. అయితే అప్పటినుంచి ఫోటోషూట్లు, ట్రిప్పులతో బిజీగా గడిపిన ఆమె, చివరకు “రామబాణం” అనే సినిమాలో కనిపించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, డింపుల్‌కు కొత్త అవకాశాల కోసం దాదాపు ఏడాది పైగా ఎదురు చూస్తోంది.

ఇక రీసెంట్ గా శర్వానంద్ సరసన “భోగి” అనే సినిమాకు సైన్ చేసింది డింపుల్, ఈ మూవీ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనుండగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో మళ్లీ ఫుల్ బిజీ కావాలని చూస్తున్న తరుణంలో మరో వివాదంలో చిక్కుకుంది. డింపుల్ హయాతి ఇటీవల షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్మెంట్‌కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అక్కడ ఆమె పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను హోమ్ స్టాఫ్‌గా నియమించుకుంది. అయితే, వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా, హింసించినట్టు ఒక మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం వివాదానికి దారితీసింది.

పనివారిపై టార్చర్ ఆరోపణలు: వైరల్ వీడియో

అసలు విషయం ఏమంటే, ఆ యువతులను ఉద్యోగానికి పంపిన మహిళ, డింపుల్ కుటుంబం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలో పేర్కొంది. తన భర్తపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడని, అమ్మాయిలను మానసికంగా వేధించారన్న ఆరోపణలు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో, ఆ మహిళ తన వ్యాఖ్యల్లో “డింపుల్ భర్త” అనే పదాన్ని ప్రస్తావించడంతో, డింపుల్ హయాతి నిజంగా పెళ్లి చేసుకుందా? ఆమెతో కలిసి ఉన్న వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

డింపుల్ పెళ్లిపై నెటిజన్ల ప్రశ్నలు

ఇప్పటి వరకు డింపుల్ ఈ ఆరోపణలపై స్పందించకపోవడం మరింత ఊహాగానాలకు తావిస్తోంది. డింపుల్ హయతీ ఎప్పుడు పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. డింపుల్ హయాతి ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందించనుంది? ఆమె పెళ్లి సంగతి నిజమేనా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం డింపుల్ హయతి ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఆమె పెళ్లి చేసుకుందా, ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాదం, ఆమె వ్యక్తిగత విషయాలపై త్వరలో పూర్తి సమాచారం బయటపడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.