|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dimple Kapadia: రొమాంటిక్‌ సీన్‌.. చేయనని మొండికేసిన హీరోయిన్‌

Published: 24-09-2025, 6:17 AM
Dimple Kapadia: రొమాంటిక్‌ సీన్‌.. చేయనని మొండికేసిన హీరోయిన్‌

‘బాబీ’ సినిమాతో పేరు తెచ్చుకున్న డింపుల్ కపాడియా, అనిల్ కపూర్ తో నటించిన ‘జన్బాజ్’ సినిమా షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ షూట్ చేయడానికి ఇబ్బంది పడింది. ఆ సీన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

డింపుల్ కపాడియా 'జన్బాజ్' సినిమా షూటింగ్ సమయంలో రొమాంటిక్ సీన్ చేయడానికి ఇబ్బంది పడింది.

2

అనిల్ కపూర్ ఛాతీపై గుబురుగా ఉన్న వెంట్రుకల వల్ల డింపుల్ ఆ సీన్ చేయడానికి నిరాకరించింది.

4

ఈ ఘటన తర్వాత డింపుల్ అనిల్ ని చాలా రోజులు ఏడిపించిందట!

జన్బాజ్ సినిమా షూటింగ్

‘బాబీ’ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది డింపుల్‌ కపాడియా ( Dimple Kapadia ). హిందీలో అనేక హిట్‌ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. అయితే అనిల్‌ కపూర్‌ ( Anil Kapoor )తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్‌ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్‌ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్‌ మూవీలో అనిల్‌ కపూర్‌, డింపుల్‌ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.

అనిల్ కపూర్ మరియు డింపుల్ కపాడియా

రొమాంటిక్‌ సీన్‌ అయితే ఈ మూవీలోని ఓ షాట్‌ కోసం.. ఫిరోజ్‌ ఖాన్‌ ఫామ్‌హౌస్‌ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్‌ (ఇంటిమేట్‌) సీన్స్‌ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్‌లోకి వచ్చారు. కానీ అనిల్‌ చొక్కా విప్పగానే డింపుల్‌ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్‌ చేసేందుకు అంగీకరించింది. అనిల్‌ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్‌ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్‌ మూవీలోని ఓ సాంగ్‌లో హీరోయిన్‌ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.

రొమాంటిక్ సీన్ వివాదం

చివరికి డింపుల్ ఆ సీన్ చేసినా, అనిల్ కపూర్ ఛాతీపై వెంట్రుకలు చూసి ఆమె అతన్ని చాలా రోజులు ఏడిపించిందని వినవచ్చు. ఈ ఘటన సినిమా చరిత్రలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.