|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ డైరెక్టర్ తో శింబు మూవీ ఫిక్స్! యూత్ కి పండగే పండగ!!

Published: 03-03-2026, 6:35 AM
మాస్ డైరెక్టర్ తో శింబు మూవీ ఫిక్స్! యూత్ కి పండగే పండగ!!
  • డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఖాతాలో మరో హిట్ సినిమా చేరే అవకాశం!
  • శింబుతో అశ్వత్ కొత్త సినిమా.. త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్!
  • ఓ మై కడువలె, ఓరి దేవుడా సినిమాలతో అశ్వత్ మారిముత్తు క్రేజ్!
  • రెండో ఛాన్స్ కాన్సెప్ట్ తోనే అశ్వత్ మారిముత్తు సినిమాలు!

టాలీవుడ్ లో సరికొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అశ్వత్ మారిముత్తు. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ హీరో ఎవరో తెలుసా?

అశ్వత్ మారిముత్తు క్రేజ్ ఏంటో తెలుసా?

Ashwath Marimuthu: జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి ఒక అనుభవాన్ని పరిచయం చేస్తే.. మరొకరికి వేరే అనుభవాన్ని ఇస్తుంది. అదే, లైఫ్ ఫిలాసఫీ. కాని, కొన్ని సందర్భాలలో లైఫ్ కూడా రెండో ఛాన్స్ ఇస్తుంది. అలా ఇస్తే ఎలా ఉంటుంది అనేది సరికొత్త కాన్సెప్ట్. సేమ్ అదే కాన్సెప్ట్ తో రెండు సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు ఓ దర్శకుడు. ఆ దర్శకుడు తన మూడవ సినిమా కోసం ఏకంగా స్టార్ హీరోని ఫిక్స్ చేశాడు.

శింబుతో సినిమా.. స్టోరీ లైన్ ఇదేనా?

ఆ దర్శకుడు మరెవరో కాదు అశ్వత్ మారిముత్తు(Ashwath Marimuthu). ఈ దర్శకుడు చేసిన ఫస్ట్ మూవీ ఓ మై కడువలె. లైఫ్ మనకి రెండో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. అదే సినిమాను తెలుగులో ఓరి దేవుడా పేరుతో విశ్వక్ సేన్ చేశాడు. ఈ సినిమాకు కూడా అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఇక ఇటీవల ఈ దర్శకుడి నుంచి వచ్చిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ప్రదీప్ రంగరాజన్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా లైఫ్ రెండో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోనే వచ్చింది.

యూత్ ఫుల్ కాన్సెప్ట్ తోనే మళ్ళీ హిట్ కొడతాడా?

కానీ, ఈ కాన్సెప్ట్ కి ఫాదర్ ఎమోషన్ ను యాడ్ చేసి ఆడియన్స్ ను మెస్పరైజ్ చేశాడు అశ్వత్. దాంతో, ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా రెండు సినిమాలను ఒకే కాన్సెప్ట్ తో చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఇక రీసెంట్ గా అశ్వత్ తమిళ స్టార్ శింబుకి ఒక కథను వినిపించాడట. ఆ కథ హీరోకి చాలా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి స్టార్ హీరో కోసమైనా కథను మారుస్తాడా లేదా మళ్ళీ అదే కథతో వచ్చి మరి హిట్ కొడతాడా అనేది చూడాలి.

అశ్వత్ మారిముత్తు, శింబు కాంబో మూవీ టాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.