|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుడ్ న్యూస్: మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అట్లీ, ప్రియా మోహన్! ఆనందంలో అభిమానులు!!

Published: 20-01-2026, 4:30 AM
గుడ్ న్యూస్: మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అట్లీ, ప్రియా మోహన్! ఆనందంలో అభిమానులు!!
  • దర్శకుడు అట్లీ, ప్రియా మోహన్ దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు.
  • ప్రియా మోహన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
  • 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2023లో మీర్ అనే కుమారుడు జన్మించాడు.
  • ప్రియా మోహన్ నటిగా, నిర్మాతగా పలు చిత్రాల్లో పనిచేశారు.

ప్రముఖ దర్శకుడు అట్లీ, నటి ప్రియా మోహన్ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా మోహన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండో బిడ్డకు జన్మనివ్వనున్న అట్లీ దంపతులు

Atlee – Priya Mohan: సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అట్లీ(Atlee) ఒకరు. ఇప్పటివరకు ఈయన దర్శకుడిగా ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఈ సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు అట్లీ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ తెలియజేశారు.

దర్శకుడు అట్లీ నటి ప్రియా మోహన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇదివరకే ఒక బాబు ఉన్నారు. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ప్రియా మోహన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ… తన ఇల్లు మరో వ్యక్తి కోసం ఎదురుచూస్తుందని, ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తనపై మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అంటూ ప్రియ మోహన్ సెకండ్ ప్రెగ్నెన్సీ(Second Pregnancy ) విషయాన్ని తెలియజేశారు .

సోషల్ మీడియా ద్వారా శుభవార్త తెలిపిన ప్రియా మోహన్

ఇలా ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ తన బేబీ బంప్ (Baby Bump)ఫోటోలను కూడా షేర్ చేశారు దీంతో ఈమె బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. డైరెక్టర్ అట్లీ నటి ప్రియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ దంపతులు నవంబర్ 9, 2014లో వివాహం చేసుకోగా వీరికి 2023 వ సంవత్సరంలో “మీర్” (Meer)అనే అబ్బాయి జన్మించారు. ఇక తాజాగా ఈ దంపతులు 2026వ సంవత్సరంలో మరో బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. అతి త్వరలోనే ప్రియా మోహన్ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.

అట్లీ, ప్రియా మోహన్ సినీ ప్రయాణం

ఇక ప్రియా విషయానికి వస్తే ఈమె నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సింగం, నాన్ మహాన్ అల్లా , రెడ్ చిల్లీస్, యువరత్న వంటి సినిమాలలో నటించారు .అలాగే పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు .ప్రస్తుతం ఈమె అట్లీ నిర్మాణ సంస్థ వ్యవహారాలను చూసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక అట్లీ సినిమాల విషయానికి వస్తే ఈయన 2013 వ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజారాణి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అట్లీ తదుపరి వరుస సినిమాల ద్వారా సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన తన ఆరవ సినిమాని పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

మొత్తానికి అట్లీ, ప్రియా మోహన్ దంపతులు తమ జీవితంలో మరో సంతోషకరమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. వారికి అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.