|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ తో బాబీ కొల్లి సంచలన భేటీ! కర్మయోగి అంటూ వైరల్ పోస్ట్! నెక్స్ట్ మూవీ ఫిక్స్?

Published: 08-04-2026, 7:35 AM
పవన్ కళ్యాణ్ తో బాబీ కొల్లి సంచలన భేటీ! కర్మయోగి అంటూ వైరల్ పోస్ట్! నెక్స్ట్ మూవీ ఫిక్స్?
  • పవన్ కళ్యాణ్‌ను కలిసిన డైరెక్టర్ బాబీ కొల్లి, ‘కర్మయోగిని చూశానంటూ’ సంచలన పోస్ట్!
  • చిరంజీవితో ‘మెగా 158’ పనుల్లో బిజీగా ఉన్న బాబీ, పవన్ కళ్యాణ్‌తో భేటీ వెనుక అసలు కారణమిదే!
  • పవన్ కళ్యాణ్ ఒక ఋషిలా కనిపించారని, ఆయన నిస్వార్థతకు ఫిదా అయ్యానన్న బాబీ.
  • పవన్ కళ్యాణ్ కోసం బాబీ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారా? టాలీవుడ్‌లో హాట్ టాక్!

టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. బాబీ తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

బాబీ ఎమోషనల్ పోస్ట్ వెనుక అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న ‘మెగా-158’ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉంటూనే, తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భేటీ అనంతరం బాబీ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో పవన్‌ను ఒక నటుడిగా చూసిన బాబీ, ఇప్పుడు ఒక రాష్ట్రానికే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ను చూసి ఎగ్జైట్ అయ్యారు. లోపలికి వెళ్లగానే చిరునవ్వులు చిందిస్తున్న పవన్‌ను చూస్తే ఒక ఋషిలా కనిపించారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పెంచుకున్న నాయకులను చూశాం కానీ, జనహితం కోసం తనకున్న విలాసవంతమైన జీవితాన్ని, రాజభోగాలను వదులుకుని నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ తనకు ఒక శిఖరంలా కనిపించారని బాబీ కొనియాడారు.

జ్ఞానం కోసం అడవి బాట పట్టిన బుద్ధుడిని చరిత్రలో చదువుకున్నామని, కానీ జనం కోసం సుఖాలను త్యాగం చేసిన కర్మయోగిని ఇవాళ కళ్లారా చూశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ పై తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుతూనే, అన్నీ ఉన్నా సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన వ్యక్తిత్వం తనను ఫిదా చేసిందని బాబీ ఆవేదనతో కూడిన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పవన్‌తో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు స్టోరీ చెప్పడానికి కలిశారని అంటుంటే.. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ కోసం బాబీ ఏదైనా పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొందరు మాత్రం ఏప్రిల్ 11న మెగాస్టార్ సినిమా ప్రారంభంకు పవన్‌ను ఆహ్వానించడానికే బాబీ వెళ్లారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం బాబీ కొత్త కథ సిద్ధం చేస్తున్నారా?

మెగాస్టార్ సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికేనా ఈ కలయిక?

మొత్తానికి బాబీ కొల్లి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, బాబీ కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.