
ప్రముఖ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై యంగ్ హీరోయిన్ నవీనా బోలె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇంట్లో కలిసిన సమయంలో ఆమెను అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Key Points
యంగ్ హీరోయిన్‌ను డైరెక్టర్ సాజిద్ ఖాన్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు.
నవీనా బోలె తన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
బట్టలు విప్పి కూర్చోమని, బాడీ ఎంత కంఫర్ట్‌గా ఉందో చెక్ చేయాలని డిమాండ్ చేశాడని ఆరోపణ.
సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతూ నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
నవీనా బోలె ఆరోపణలు
డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై ఇంతకు ముందు సెక్సువల్ హరాజ్మెంట్ ఆరోపణలు చాలానే వచ్చాయి. మీటూ మూమెంట్ టైమ్‌లో ఇండస్ట్రీకి చెందిన దాదాపు తొమ్మిది మంది ఆయన లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పారు. ఇంకా ఆ లిస్ట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నవీనా బోలె కూడా ఇలాంటి భయానక అనుభవాన్ని పొందినట్లు తెలిపింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన తనకు ఆఫర్ ఉందని.. కలవాలని.. సాజిద్ నుంచి ఫోన్ కాల్ రావడంతో చాలా ఎగ్జైట్ అయిపోయినట్లు చెప్పింది. కానీ అక్కడికి వెళ్లాక జరిగిన ఘటనతో జీవితంలో మరోసారి ఈ వ్యక్తిని మీట్ కావొద్దని అనుకున్నట్లు తెలిపింది.
‘ నేను కలిసింది తన ఆఫీసులో కాదు. ఇంట్లోనే కలవమన్నాడు. మంచి రోల్ దొరుకుతుందనే ఆశతో వెళ్లా. కానీ నన్ను బట్టలు విప్పి కూర్చోమన్నాడు. నీ బాడీ ఎంత కంఫర్ట్‌గా ఉందో చూడాలని అనుకుంటున్నా అన్నాడు. నాకు చాలా అన్‌కంఫర్ట్‌గా అనిపించింది. నా కోసం కింద వెయిట్ చేస్తున్నారని చెప్పా. దీంతో అతను సంబంధం లేకుండా స్టేజీపైనా బికినీ వేసుకోవచ్చు కదా అంటూ కొన్ని బూతు పదాలను వాడాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
సాజిద్ ఖాన్ వివాదం
సోషల్ మీడియా ప్రతిచర్య
నవీనా బోలె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సాజిద్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి మళ్ళీ చర్చను రేకెత్తిస్తోంది.


