
‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ తన కొత్త సినిమా ‘అరి’ తో ప్రేక్షకులను పలకరించనున్నారు. మనిషిలోని ఆరు అంతర్గత శత్రువుల కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఆయన ఏడేళ్లపాటు హిమాలయాల్లో పరిశోధన చేశారు. ఆయన అంకితభావం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Key Points
డైరెక్టర్ జయశంకర్ 'పేపర్ బాయ్' తర్వాత 7 ఏళ్లకు 'అరి'తో తిరిగి వస్తున్నారు.
సినిమా కోసం దర్శకుడు జయశంకర్ 7 ఏళ్లు హిమాలయాల్లో పరిశోధన చేశారు.
మనిషిలోని కామం, క్రోధం వంటి ఆరు అంతర్గత శత్రువుల కాన్సెప్ట్‌తో 'అరి' రూపొందింది.
కథ కోసం 20కి పైగా ఆధ్యాత్మిక ప్రాంతాలు, సద్గురువులను దర్శకుడు కలిశారు.
జయశంకర్ రీ ఎంట్రీ: ‘అరి’ కథా నేపథ్యం
పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయశంకర్. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ జయ శంకర్ ఏడేళ్ల తర్వాత దర్శకుడిగా వస్తున్న సరికొత్త సినిమా అరి. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ , వినోద్ వర్మ, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మనిషిలోని కోరికల ఆధారంగా తెరకెక్కిన అరి మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అరి సినిమా కోసం డైరెక్టర్ జయశంకర్ చేసిన పరిశోధన ఆయన డెడికేషన్ ఎలా ఉందో చెబుతోంది. స్నేహితులు, బంధాలు అన్నింటికి దూరంగా అదృశ్యమయి ఏడేళ్లపాటు హిమాలయాల్లో ఉండి అరి కోసం కష్టపడ్డారు జయశంకర్.
‘పేపర్ బాయ్’ తర్వాత చేసే చిత్రం కూడా అంతే స్థాయిలో ఉండాలని, అలానే ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలని జయ శంకర్ అనుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా ఉండాలని , అలా జరిగాలి అంటే ఇంత వరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌ని చెప్పాలి అని జయశంకర్ డిసైడ్ అయ్యారు.
అందుకే ‘అరి’ అనే కొత్త పాయింట్‌తో అందరి ముందుకు తీసుకు వచ్చారు. అరి అంటే శత్రువు అనే అర్థం వస్తుంది. అరిషడ్వర్గాల్లో మెదటి రెండు పదాలు తీసుకోని సినిమాకి పేరు పెట్టారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇంత వరకు రాని కాన్సెప్ట్‌తో ‘అరి’ చిత్రాన్ని తెరకెక్కించారు.
హిమాలయాల్లో 7 ఏళ్ల పరిశోధన
అరి షడ్వర్గాల కాన్సెప్ట్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ ఎంతో లోతైన పరిశోధన చేసినట్లు మేకర్స్ తెలిపారు. కథను రాయడానికి పురాణేతిహాసాల్ని తిరగేశారు. ఇండియాలోని 20కిపైగా ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. కంచి కామకోటి నుంచి ఇస్కాన్ , ఆర్ట్ ఆఫ్ లివింగ్, చిన్మయ మిషన్ వంటి వరకు తిరిగారు.
రమణ మహర్షి ఆశ్రమంతో పాటు ఎంతోమంది సద్గురులు, సన్యాసులు, గురూజీలను కలిశారు. వాళ్లు ఇచ్చే టైమ్ కోసం నెలలపాటు ఎదురుచూసి వారి నుంచి ఎన్నెన్నో గొప్ప విషయాలను సేకరించారు దర్శకుడు జయ శంకర్. భగవద్గీత , వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, యోగాల గురించి తెలుసుకున్నారు.
మనిషిలో కోపం, ఈర్శ్య, కామం వంటి ఆరు శత్రువులను ఎలా జయించాలో గ్రహించారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి మనిషిలో ఉండే ఆరు అంతర్గత శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. ఈ కాన్సెప్ట్‌పైనే అరి సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ జయశంకర్.
అరిషడ్వర్గాలు: సినిమాలోని ముఖ్య పాయింట్
అయితే, ఈ అరిషడ్వర్గాలను అదుపులో ఎలా పెట్టుకోవాలో ఇంతవరకు గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు.. ఎందుకు?.. అని గురూజీలను అడిగి తెలుసుకున్నారు దర్శకుడు. అంతే కాకుండా కొంత కాలం ఆశ్రమంలో గడిపి ఆధ్యాత్మిక కోణంలో అరి షడ్వర్గాల మీద అధ్యయనం చేశారు.
అలా సేకరించిన విషయాలని ప్రజలకి ఉపయోగపడేలా అనేక సంవత్సరాలు కష్టపడి తన మేకింగ్ స్టైల్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారట జయశంకర్. అయితే, అరి సినిమాను రిలీజ్‌కి ముందే పలు అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శించారు. అలా అరి సినిమా దాదాపు 25 అవార్డులు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.
అంతేకాకుండా అరి సినిమాను వీక్షించిన దేశంలోని ప్రముఖ రాజకీయ, సినీ, పీఠాధిపతులు ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కిషన్ రెడ్డి, యోగి అధిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
దర్శకుడు జయశంకర్ అంకితభావం, లోతైన పరిశోధన ‘అరి’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అరిషడ్వర్గాల వంటి వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని ఆశిద్దాం.


