|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ నిజం: ‘నేను శైలజ’ కథ ఆ స్టార్ హీరోయిన్‌కు చెప్పారట! చివరకు ఏం జరిగిందంటే..?

Published: 25-01-2026, 5:05 AM
షాకింగ్ నిజం: 'నేను శైలజ' కథ ఆ స్టార్ హీరోయిన్‌కు చెప్పారట! చివరకు ఏం జరిగిందంటే..?
  • దర్శకుడు కిషోర్ తిరుమల: ‘నేను శైలజ’ కథ ముందుగా స్టార్ హీరోయిన్‌కు చెప్పాను.
  • ఆ హీరోయిన్ పాత్రకు సరిపోదని సరిగ్గా చెప్పలేదన్న కిషోర్ తిరుమల.
  • కీర్తి సురేష్ అమాయకపు ముఖంతో పాత్రకు న్యాయం చేస్తుందని ఎంపిక చేశారన్న దర్శకుడు.
  • ‘నేను శైలజ’ సినిమాతో కీర్తి సురేష్‌కు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు లభించింది.

రామ్ పోతినేని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను శైలజ’ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ నిజం బయటపడింది! అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఏం జరిగిందో తెలుసుకుందాం!

కీర్తి సురేష్ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్?

రామ్, కీర్తి సురేష్ హీరోగా న‌టించిన నేను శైలజ సినిమా అప్ప‌ట్లో సైలెంట్ గా వ‌చ్చి సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర‌వాత‌నే కీర్తి సురేష్ ఎక్కువ‌మందికి ద‌గ్గ‌రైంది. త‌ర‌వాత కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే నిజానికి ఈ సినిమా క‌థ ముందుగా కీర్తి సురేష్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ విష‌యాన్ని నేను శైల‌జ డైరెక్ట‌ర్ కిశోర్ తిర‌మ‌ల తాజాగా వెల్ల‌డించారు. నేను శైల‌జ సినిమా కోసం మొద‌ట కీర్తి సురేష్ ఆడిష‌న్స్ లో న‌చ్చింద‌ని చెప్పారు. కానీ నిర్మాత‌లు ఓ స్టార్ హీరోయిన్ ను సంప్ర‌దించి ఆమెకు క‌థ చెప్ప‌మ‌న్నార‌ని అన్నారు.

ఆ హీరోయిన్ పాత్ర‌కు సెట్ కాదు అనిపించి తాను క‌థ‌ను స‌రిగ్గా చెప్పలేద‌ని అన్నారు. క‌థ విన్న త‌ర‌వాత హీరోయిన్ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో హ‌మ్మ‌య్య అనుకున్నాన‌ని చెప్పారు. త‌ర‌వాత కీర్తితోనే సినిమా చేశామ‌న్నారు. కొత్త హీరోయిన్.. అనుకున్న‌ట్టుగా అమాయ‌క‌పు ముఖం కాబట్టి కీర్తి సురేష్ అయితేనే పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని భావించిన‌ట్టు తెలిపారు. ఇక ఈ సినిమా పాట‌లు, స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త‌ర‌వాత కిశోర్ తిరుమ‌ల కూడా అవ‌కాశాలు అందుకున్నారు.

దర్శకుడు కిషోర్ తిరుమల సంచలన విషయాలు!

నేను శైలజ వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

నేను శైలజ సినిమా వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. టాలీవుడ్ సమాచారం ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.