|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దర్శకుడు మారుతి సంచలనం: నిర్మాతలకు నచ్చినట్టు కథలు మార్చక తప్పదు!

Updated: 05-01-2026, 1:44 PM
దర్శకుడు మారుతి: నిర్మాతలకు నచ్చినట్టు కథలు మార్చక తప్పదు!
  • దర్శకులు ఫైనల్ చేసిన కథలను నిర్మాతలు, హీరోలు మారుస్తారని మారుతి అంగీకరించారు.
  • డబ్బు పెట్టేవాళ్ళకు నచ్చినట్టు సినిమాలు చేయాల్సి వస్తుందని, కొన్నిసార్లు ఒరిజినాలిటీ దెబ్బతింటుందని వివరించారు.
  • ‘రాజాసాబ్’ విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని, ప్రభాస్ తన రైటర్ ని గుర్తించారని తెలిపారు.
  • సినిమా బయటకు వెళ్లేంతవరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయని, దర్శకుడిని పూర్తిగా నమ్మాలని సూచించారు.

దర్శకుడు మారుతి సినీ ఇండస్ట్రీలో దర్శకులు ఎదుర్కొనే సవాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు కోరిన విధంగా కథలను మార్చాల్సి వస్తుందని అంగీకరించారు. అయితే, ప్రభాస్ ‘రాజాసాబ్’ తో తనకు లభించిన స్వేచ్ఛ గురించి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

నిర్మాతలకు తగ్గట్టు కథల మార్పు: మారుతి వాదన

Director Maruthi : సినీ పరిశ్రమలో దర్శకులు ఒక ఫైనల్ కథ, కథనం అనుకొని వెళ్తే మధ్యలో హీరోలు, నిర్మాతలు, హీరోయిన్స్, చాలా మంది ఆ కథలో వేలు పెట్టి చాలా మార్చేస్తారు అని అంటూ ఉంటారు. ఇదే విషయాన్ని చాలా మంది దర్శకులు కూడా నిజమే అని చెప్పారు. తాజాగా రాజాసాబ్ దర్శకుడు మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కామెంట్స్ చేసారు.(Director Maruthi)

“రాజాసాబ్” తో మారుతికి లభించిన స్వేచ్ఛ

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. నా చేత ఎవరు ఎలాంటి సినిమా అయినా చేయించుకోగలరు. ఎవరు ఏం చెప్పినా నా స్టైల్ పోగొట్టుకొకూడదు అనుకుంటా కానీ కుదరదు. డబ్బులు పెట్టేవాళ్లకు డబ్బులు ఇంపార్టెంట్, వాళ్లకు నచ్చేలా సినిమా చేయాలి అని కూడా ఉంటది. నేను తీసిన కొన్ని సినిమాల్లో యావరేజ్ లు ఉన్నాయి, పోయాయి కూడా. ఆ తప్పు నాదే. నా ఒరిజినాలిటీ పోగొట్టుకొకూడదు అని ట్రై చేస్తూ ఉంటా కానీ ఒక్కోసారి అవ్వదు. నిర్మాతలు కరెక్ట్ కాదు అంటే వాళ్లకు ఏది కరెక్ట్ అంటారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతాము. తెలియకుండా అక్కడ క్రియేటివ్ సైడ్ అది దెబ్బ తీస్తుంది.

ప్రభాస్ ప్రోత్సాహం, దర్శకుడి నమ్మకం

రాజాసాబ్ విషయంలో నాకు ఫ్రీడమ్ దొరికింది. ప్రభాస్ గారు చాలా హెల్ప్ చేసారు. నాలో రైటర్ ని గుర్తించి నా క్రియేటివిటీ బయటకు తీశారు. ప్రభాస్ గారు నా ట్యాలెంట్ గుర్తించారు కాబట్టే నేను ఎక్కువ ఫోకస్ చేశా ఈ సినిమా మీద. డైరెక్టర్ ని పూర్తిగా నమ్మాలి. అలాగే మేము చూడని తప్పులు హీరోలు, నిర్మాతలు చూసి చెప్తారు. అది చెప్తే తెలుసుకుంటాము. అన్ని పెద్ద సినిమాలు చివరి వరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. సినిమా బయటకు వెళ్లేంతవరకు కూడా ఆ సినిమాని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కరెక్ట్ వస్తుంది అవుట్ పుట్ అని అన్నారు.

మారుతి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో దర్శకులు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. క్రియేటివ్ స్వేచ్ఛకు, కమర్షియల్ అవసరాలకు మధ్య సమతూల్యత ఎంత ముఖ్యమో ఈ చర్చ తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.