
📌 Key Points
- దర్శకుడు ఎన్. శంకర్ ఇంట తీవ్ర విషాదం, తల్లి సక్కుబాయమ్మ కన్నుమూత!
- గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సక్కుబాయమ్మ.
- హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సక్కుబాయమ్మ.
- గురువారం చిత్రపురి కాలనీలో అంత్యక్రియలు, శోకసంద్రంలో సినీ పరిశ్రమ.
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సక్కుబాయమ్మ గారు కన్నుమూశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
దర్శకుడు ఎన్. శంకర్ ఇంట విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ అభిమానులను కలిచివేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిస్తే.. మరికొందరు ఆత్మ చేసుకుని ప్రాణాలో కోల్పోతున్నారు. మరికొందరు యాక్సిడెంట్ల కారణంగా మరణిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎన్. శంకర్(N. Shankar) మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ(Nimmala Sakkubayamma) (78) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు దర్శకుడు ఎన్. శంకర్ సహా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సక్కుబాయమ్మ భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11 గంటలకు చిత్రపురి కాలనీలోని హెచ్.ఐ.జి బ్లాక్ 11 లో ఉంచనున్నారని సమాచారం.
అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాతృమూర్తిని కోల్పోవడంతో శంకర్ కుటుంబానికి ధైర్యం కలగాలని, సక్కుబాయమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నిమ్మల శంకర్ సినిమాల విషయానికొస్తే.. ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’, ‘జై బోలో తెలంగాణ’ వంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
వృద్ధాప్యంతో సక్కుబాయమ్మ కన్నుమూత
రేపు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
సక్కుబాయమ్మ గారి మృతి టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్. శంకర్ గారి కుటుంబానికి మనమంతా ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


