
📌 Key Points
- దిశా పటానీ, పంజాబీ సింగర్ తల్విందర్‌తో చికాగోలో ప్రత్యేకంగా దర్శనం – ఫోటోలు వైరల్!
- తల్విందర్ సింగ్ ప్రదర్శన తర్వాత దిశా చేయి పట్టుకుని కారులో వెళ్లడం హాట్ టాపిక్!
- నెటిజన్స్ కామెంట్స్: దిశా, తల్విందర్ డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు!
- దిశా పటానీ వ్యక్తిగత జీవితంపై బాలీవుడ్‌లో మరో సంచలనం – అభిమానుల్లో ఆసక్తి!
బాలీవుడ్ సెన్సేషన్ దిశా పటానీ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఆమె ఒక పంజాబీ సింగర్‌తో డేటింగ్ చేస్తుందంటూ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
దిశా పటానీ, సింగర్‌తో సీక్రెట్ మీటింగ్?
బాలీవుడ్ అందాల తార దిశా పటాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందానికి అందం, బోలెడు అవకాశాలతో ఇండస్ట్రీని దున్నేస్తోంది దిశా పటాని. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఆమె సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ, యూత్ గుండెల్లో గునపం దింపేస్తోంది. అయితే అలాంటి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఆమె ప్రియుడుతో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దిశా పటాని, ప్రముఖ పంజాబీ సింగర్ తల్విందర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా చికాగోలో ఓ స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఇందులో సింగర్ తల్విందర్ సింగ్ ప్రదర్శన కూడా చేశారు. అయితే ఈవెంట్ అనంతరం దిశా పటాని చేయి పట్టుకొని, బయటకు వచ్చాడు తల్విందర్. అనంతరం ఒకే కారులో ఈ జంట వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో పంజాబీ సింగర్ తల్విందర్ తో దిశా పటాని డేటింగ్ లో ఉన్నట్లు నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
చికాగోలో దిశా, తల్విందర్ రొమాంటిక్ ట్రిప్?
డేటింగ్ రూమర్స్‌పై దిశా రియాక్షన్ ఏంటి?
దిశా పటానీ, తల్విందర్ సింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాం.


