
📌 Key Points
- నవీన్ చంద్ర హీరోగా, దివి హీరోయిన్ గా హనీ మూవీ విడుదలకి సిద్ధం!
- వంటగదిలో దివి, నవీన్ చంద్ర రొమాన్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు.
- క్సుద్ర పూజలు, సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యంలో హనీ మూవీ కథనం.
- బిగ్ బాస్ ఫేమ్ దివికి గాడ్ ఫాదర్ తర్వాత మరో అవకాశం!
టాలీవుడ్ లో సంచలనం సృష్టించడానికి దివి నటించిన హనీ మూవీ సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో దివి అందాలు, నవీన్ చంద్రతో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా వంటగదిలో వచ్చే సన్నివేశాలు వేరే లెవెల్ అంటున్నారు.
హనీ మూవీలో దివి రొమాన్స్ ఓ రేంజ్ లో!
టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని హారర్ సినిమాలు వస్తుంటే, మరికొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ తో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకొని దూసుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా హాని. ఈ సినిమా పూర్తిగా క్షుద్ర పూజలు, సస్పెన్స్, మిస్టరీ నేపథ్యంలో సాగనుంది. ఈ మేరకు ఇప్పటికే హనీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి, అందరినీ ఆకట్టుకుంటోంది.
నవీన్ చంద్ర (Naveen Chandra ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనీ. ఈ సినిమాలో బిగ్ బాస్ దివి, మంగళవారం సినిమా ఫేమ్ దివ్యా పిళ్లై నటిస్తున్నారు. ఈ హనీ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పలాస సినిమాను రూపొందించిన కరుణ కుమార్, ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీసినట్లు తెలుస్తోంది. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రవి పీట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ అరసాడ సంగీత స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
వంటగదిలో దివి, నవీన్ చంద్ర కెమిస్ట్రీ అదుర్స్!
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా, ఇవాళ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీలో మొత్తం క్షుద్ర పూజలు చుట్టే కథ ఉంటుందట. అదే సమయంలో మూఢ నమ్మకాల గురించి చాలా అద్భుతంగా తీసినట్లుగా సమాచారం. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ లో సీన్స్ కనిపించాయి. అయితే, ఈ సినిమాలో నవీన్ చంద్ర చేసే రొమాన్స్ చాలా అద్భుతంగా ఉంటుందట. ముఖ్యంగా వంట గదిలో దివితో చేసే రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పాపులర్ అయ్యారు దివి. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో స్పెషల్ రోల్ చేశారు దివి. ఈ సినిమా తర్వాత దివి అంటే ఎవరో జనాలకు కాస్త తెలిసిపోయింది. దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ షో లో దివి పాల్గొనడం చాలా ప్లస్ అయింది. ఈశ్వర్ ద్వారా మంచి గుర్తింపు సాధించింది దివి.
సస్పెన్స్ థ్రిల్లర్ గా హనీ మూవీ.. అంచనాలు పెంచేలా!
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆకట్టుకుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు అవకాశం ఇస్తానని ప్రకటించి, గాడ్ ఫాదర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. అనంతరం క్యాబ్ స్టోరీస్, రుద్రవీణ లాంటి సినిమాలలో మెరిసి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు హనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులం ముందుకు రానుంది దివి. ఈ మూవీ మొత్తం సైకాలజికల్ హారర్ నేపథ్యంలో రానుందట. మరి ఈ సినిమాతో అయినా, దివికి మంచి సక్సెస్ వస్తుందా? లేదా? అనేది చూడాలి.
A post shared by Naveen Chandra (@naveenchandra212)
హనీ మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దివి కెరీర్ కి ఈ సినిమా ఒక మైలురాయి అవుతుందా చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


