
📌 Key Points
- దివి పెళ్లి ప్రకటనతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
- ఆస్తులు, హోదా కాదు.. అర్థం చేసుకునే వాడే కావాలన్న దివి కండీషన్స్!
- త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ దివి!
- సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాకపోయినా పర్వాలేదన్న దివి
బిగ్ బాస్ దివితో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. అయితే తన కాబోయే భర్త విషయంలో కొన్ని షాకింగ్ కండిషన్స్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కాబోయే భర్తపై దివి షాకింగ్ కామెంట్స్!
దివి (divi)బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుని నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా నటిస్తూ తనదైన నటన, అందంతో ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన మనసులోని మాటను బయటపెట్టింది. బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు మౌనంగా ఉన్న ఆమె, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. అయితే, కాబోయే భర్త విషయంలో ఆమె పెట్టిన కండిషన్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి అనగానే కోటీశ్వరుడో, పారిశ్రామికవేత్తనో కావాలని కోరుకుంటారు. కానీ దివి మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ‘‘నేను బ్రేకప్ నుండి పూర్తిగా కోలుకున్నాను.
దివి పెట్టిన కండీషన్లు వైరల్!
ఇప్పుడు కొత్త వ్యక్తి కోసం చూస్తున్నాను. నాకు కాబోయే వాడు చాలా రిచ్‌గా ఉండాలి, ఎత్తుగా, తెల్లగా, అందంగా ఉండాలి అనే నిబంధనలు నాకిప్పుడు లేవు. ఒకప్పుడు అవి ముఖ్యం అనిపించేవేమో కానీ, ఇప్పుడు మాత్రం కాదు. నన్ను అర్థం చేసుకుని, నాకు తగినంత స్వేచ్ఛ ఇచ్చే వ్యక్తి కావాలి. అతడు నాకిష్టమైన స్నేహితుడిగా ఉండాలి. మేమిద్దరం కలిసి వంట చేసుకోవాలి, కలిసి కాఫీ తాగాలి.. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే నాకు ముఖ్యం. హోదా కంటే కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం, కలిసి ఎదగడం అనేదే నాకైతే ఇష్టం’’ అని దివి చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో మూడు నాలుగేళ్ల తర్వాత కూడా ఆ బంధం అంతే బలంగా ఉండాలని ఆమె ఆశిస్తోంది. భాగస్వామి కేవలం సినీ పరిశ్రమకు చెందిన వాడే కావాలని తానేమీ అనుకోవడం లేదని దివి పేర్కొంది.
పెళ్లి బంధంపై దివి ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఇండస్ట్రీ బయటి వ్యక్తి అయినా నాకు అభ్యంతరం లేదు. కానీ, అతడు నాకు కండీషన్లు పెట్టకుండా.. నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదు చేసే మనస్తత్వం ఉన్న వాళ్లంటే నాకు అస్సలు నచ్చదు. నెగెటివిటీ లేకుండా, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటూ ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తే నాకు కరెక్ట్ పార్ట్నర్’’ అని దివి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్తి, హోదా కాకుండా తనను అర్థం చేసుకునే వాడైతే జీవితం బాగుంటుందని చెప్తోంది.
దివి పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


