|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Divvala Madhuri: బిగ్‌బాస్‌లో రీతూ రోత పనులు చూడలేకపోయాను, అందుకే ప్రశ్నించాల్సి వచ్చింది

Published: 12-12-2025, 7:48 AM
Divvala Madhuri: బిగ్‌బాస్‌లో రీతూ రోత పనులు చూడలేకపోయాను, అందుకే ప్రశ్నించాల్సి వచ్చింది
  • బిగ్ బాస్ నుండి బయటకొచ్చిన దివ్యెల మాధురి ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు.
  • రీతూ చౌదరి, డిమోన్ పవన్ పనులపై ‘రోత పనులు’ అంటూ పరోక్ష వ్యాఖ్యలు.
  • రీతూ తల్లి గురించి తమన్నా సింహాద్రి ద్వారా వచ్చిన మెసేజ్ వివరణ.
  • తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని, నిజమే మాట్లాడానని మాధురి స్పష్టీకరణ.

బిగ్ బాస్ సీజన్ నుండి బయటకొచ్చిన దివ్వెల మాధురి, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్‌లో రీతూ చౌదరి, డిమోన్ పవన్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తనకు అవి ‘రోత పనులు’గా అనిపించాయని వెల్లడించింది. రీతూ తల్లి గురించి వచ్చిన వార్తలపై కూడా ఆమె స్పష్టతనిచ్చింది.

బిగ్ బాస్ లో దివ్యెల మాధురి అనుభవాలు

దువ్వాడ శ్రీనివాస్ పేరు చెబితే దివ్వెల మాధురి పేరు ఇట్టే గుర్తొస్తుంది. వీరిద్దరి గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు, కుటుంబ గొడవలతో వీరు చాలా ఫేమస్ అయిపోయారు. అందుకే దివ్వెల మాధురికి బిగ్ బాస్‌లో కి వెళ్లే ఛాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మాధురి చిన్న రీల్ చేసినా చాలు బోలెడన్ని లైకులు, భయంకరమైన కామెంట్లు వస్తాయి. రెండు వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి వచ్చింది. ఆ రెండు వారాల్లోనే ఎన్నో గొడవలు, అరుపులు, తిట్లు ఇలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువే ఇచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రీతూ గురించి కొన్ని కామెంట్లు చేసింది.

దివ్వెల మాధురి పుట్టినరోజు కావడంతో ఒక యూట్యూబ్ వార్త ఛానల్ వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అందులో రీతు గురించి మాట్లాడింది. రీతూ చౌదరి తల్లి డిమోన్ పవన్ తో దూరంగా ఉండమని తన కూతురుకు చెప్పమందని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మాధురి అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయం గురించి తాజాగా మాధురి క్లారిటీ ఇచ్చింది. తనకు తమన్నా సింహాద్రి అనే అమ్మాయి ఫోన్ చేసి రీతూను పవన్ కు దూరంగా ఉండమని రీతూ తల్లి చెప్పమందని రిక్వెస్ట్ చేసినట్టు తెలిపింది. అదే తాను బిగ్ బాస్ లోకి వెళ్ళాక చెప్పానని వివరించింది. కానీ ఇప్పుడు రీతూ తల్లి నేను అలా చెప్పలేదని అంటోందని, ఏ తల్లి అయినా కూడా అలాగే చెబుతుందని మాధురి అది. ఇప్పుడు రీతు తల్లికి తన కూతురు చేస్తున్నది సరైనదనిపిస్తుందేమో.. అందుకే అలా స్పందించి ఉంటుందని మాధురి వివరించింది.

రీతూ చౌదరి వివాదంపై మాధురి వివరణ

అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, బయటకు వచ్చాక కూడా ఈ విషయం మాట్లాడుకుంటారు కాబట్టి అబద్ధం ఎందుకు చెబుతానని ప్రశ్నించింది మాధురి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు కూడా కొన్ని విషయాలు చాలా ఇరిటేటింగ్ గా అనిపించాయని, నా ముందే వాళ్ళు చేసినా రోత పనులు చూడలేకపోయాను అంటూ డిమోన్ పవన్, రీతూ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. ఆ విషయంలో తనకి నచ్చక అరిచానని, మొన్న సంజనా కూడా క్వశ్చన్ చేసిందని… అందులో తప్పేముందని అంది. హౌస్ లో ఏం జరిగితే అదే కదా మాట్లాడతామని మాధురి వివరించింది. తమన్నా సింహాద్రికి ఫోన్ చేసి నువ్వు చెప్పమంటేనే నేను చెప్పాను, మళ్లీ ఇంటర్వ్యూలో రీతూ తల్లి అలా చెప్పడ ఏంటని అడిగినట్టు మాధురి చెప్పింది.

డిమోన్ పవన్, రీతూ గురించి సంచలన వ్యాఖ్యలు

మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఏ తల్లి అయినా తాను చెప్పలేదని అంటుందని, రీతు తల్లి మీడియా వాళ్లతో అబద్ధం చెపుతోందని మాధురి అంది. కొంతమంది యూట్యూబ్లో కూడా దారుణంగా ప్రశ్నలు వేస్తున్నారని, కనీస విలువలు కూడా పాటించడం లేదని అంది. నా గురించి మాట్లాడితే టిఆర్పి రేటు వస్తుందని, పాపులర్ అయిపోతామని అలా చేస్తూ ఉంటారని… నా గురించి మాట్లాడే రైట్ యూట్యూబర్లకు ఏముంది అని ప్రశ్నించింది మాధురి.

మొత్తం మీద, దివ్వెల మాధురి వ్యాఖ్యలు బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని సంఘటనలపై కొత్త చర్చకు దారితీశాయి. ఆమె తన స్టాండ్‌ను సమర్థించుకుంటూ, నిజమే మాట్లాడానని స్పష్టం చేసింది. ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.