|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపావళి రోజు నాకు నిప్పంటుకుంది.. నాన్న బట్టలు చించి కాపాడాడు!

Published: 22-10-2025, 8:13 AM
దీపావళి రోజు నాకు నిప్పంటుకుంది.. నాన్న బట్టలు చించి కాపాడాడు!

బిగ్‌బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ దీపావళి వేడుకల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురయ్యారు. ఆమె దుస్తులకు నిప్పంటుకోగా, తండ్రి సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ భయంకరమైన సంఘటన నుండి ప్రియ ఎలా బయటపడిందో తెలుసుకుందాం.

Key Points

1

బిగ్‌బాస్ నటి ప్రియా మాలిక్ దీపావళి వేడుకల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురయ్యారు.

2

ఫోటోలు దిగుతుండగా తన డ్రెస్‌కు నిప్పంటుకోగా, తండ్రి చింపి ఆమెను కాపాడారు.

4

ప్రమాదం జరిగిన సమయంలో తన కొడుకు తన చేతిలో లేకపోవడం సంతోషకరమని ప్రియ వెల్లడించారు.

ప్రియా మాలిక్ దీపావళి ప్రమాదం

దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ కంటెస్టెంట్‌, బుల్లితెర నటి ప్రియా మాలిక్‌ ( Priya Malik ) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్‌ అంటుకుంది.

ఫోటోలు దిగుతుండగా.. క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్‌ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్‌కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్‌ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.

తండ్రి హీరోయిజం, ప్రాణాపాయం తప్పింది

నాకే ఆశ్చర్యం! చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్‌ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ 9తో పాపులర్‌ అయిన ప్రియ మాలిక్‌.. 2022లో ఎంటర్‌ప్రెన్యూర్‌ కరణ్‌ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్‌ జన్మించాడు.

ప్రమాదంపై ప్రియా మాలిక్ సందేశం

ప్రియా మాలిక్ అనుభవం దీపావళి వంటి పండుగల్లో జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ సంఘటన ఉదాహరణ. తండ్రి సాహసం ఆమె ప్రాణాలను కాపాడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.