
తమిళ స్టార్ హీరో సూర్య కూతురు దియా దర్శకురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ‘లీడింగ్ లైట్’ అనే డాక్యుమెంటరీ చిత్రంతో అరంగేట్రం చేసిన దియా, ఈ ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా పూర్తి చేసింది. ఈ చిత్రం ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం కాలిఫోర్నియాలో ప్రదర్శితమవుతోంది. సూర్య-జ్యోతికల నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించింది.
Key Points
సూర్య కూతురు దియా 'లీడింగ్ లైట్' చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది.
మహిళలు ఎదుర్కొనే కష్టాలపై ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని దియా రూపొందించింది.
ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు.
సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.
దియా దర్శకురాలిగా పరిచయం
తమిళ హీరో సూర్య ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. భార్య జ్యోతిక కూడా కొన్నాళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి తర్వాత తరం కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. సూర్య కూతురు దియా.. ఏ మాత్రం హడావుడి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటపడింది.
సూర్య-జ్యోతిక లది ప్రేమ వివాహం. ‘కాకా'(తెలుగులో ఘర్షణ) అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు దియా, దేవ్ అని కూతురు కొడుకు ఉన్నారు. దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. మొన్నీమధ్య స్కూలింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు ‘లీడింగ్ లైట్’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది.
‘లీడింగ్ లైట్’ డాక్యుమెంటరీ వివరాలు
సినిమా తీయడంలో తెర వెనక చాలామంది మహిళలు పనిచేస్తుంటారు. అసలు వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని దియా తీసింది. ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం దీన్ని కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 02 వరకు ప్రతిరోజూ ఈ డాక్యుమెంటరీ వేయనున్నారు.
సూర్య-జ్యోతిక నిర్మించిన ప్రాజెక్ట్
సూర్య-జ్యోతిక కూతురు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చింది, దర్శకత్వం చేసింది అనే విషయాన్ని ఇప్పటివరకు సైలెన్స్‌గానే ఉంచారు. దీన్ని సూర్య-జ్యోతిక తమ ప్రొడక్షన్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. తాజాగా సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. అలా సూర్య కూతురిని అభినందిస్తున్నారు. మొన్నీమధ్య షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. ‘ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు సూర్య కూతురు కూడా డైరెక్టర్ అయిపోయింది.
సూర్య-జ్యోతిక కూతురు దియా ఎటువంటి హడావుడి లేకుండా దర్శకురాలిగా మారడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతరం ప్రతిభకు ఇదొక చక్కటి ఉదాహరణ. కుటుంబం నుంచి లభించిన మద్దతుతో దియా భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రాజెక్ట్స్ చేయగలదని ఆశిద్దాం.


