|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. పురిటిలోనే బిడ్డను మార్చే స్కామ్.. 7.9 రేటింగ్.. ఐదు భాషల్లో!

Published: 19-07-2025, 5:11 AM
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. పురిటిలోనే బిడ్డను మార్చే స్కామ్.. 7.9 రేటింగ్.. ఐదు భాషల్లో!

థియేటర్లలో విడుదలైన ఒక్కరోజు తర్వాతే, ‘డీఎన్ఏ’ (మై బేబీ) అనే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. పురిటిలోనే బిడ్డను మార్చే స్కామ్‌పై ఆధారపడిన ఈ సినిమా 7.9 IMDb రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

Key Points

1

7.9 IMDb రేటింగ్‌తో డీఎన్ఏ సినిమా సూపర్ హిట్.

2

పురిటిలోనే బిడ్డను మార్చే స్కామ్‌పై ఆధారపడిన కథ.

4

థియేటర్ రిలీజ్ తర్వాత వెంటనే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్.

డీఎన్ఏ సినిమా – కథాంశం

ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ప్రతి వారం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల లేదా 20 ఇలా కొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. కానీ, థియేటర్లలో విడుదలైన మరుసటి రోజే ఓటీటీ లోకి రావడం చాలా అరుదైన విషయం. అలాంటిదే తాజాగా ఈ సినిమాకు జరిగింది.

ఆ సినిమానే డీఎన్ఏ. తమిళంలో మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరెక్కిన సినిమా డీఎన్ఏ. అథర్వ మురళి (గద్దలకొండ గణేష్ ఫేమ్), నిమిషా సజయన్ హీరో హీరోయిన్స్‌గా నటించగా.. రమేష్ తైలాక్ (టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్), మొహమ్మద్ జీషన్ అయూబ్, రిత్విక, విజి చంద్రశేఖర్, బోస్ వెంకట్, బాలాజీ శక్తివేల్ తదతరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన డీఎన్ఏ తమిళంలో జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సూపర్ హిట్ థ్రిల్లర్‌గాపేరు తెచ్చుకున్న డీఎన్ఏ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ సాధించుకుంది. ఈ సినిమాకు ప్రశంసలు రావడంతో తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

డీఎన్ఏ సినిమాను మై బేబీగా జూలై 18న థియేటర్లలో విడుదల చేశారు. కానీ, థియేటర్లలో విడుదలైన మరుసటి రోజే అంటే ఇవాళ (జూలై 19) డీఎన్ఏ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో మై బేబీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్‌లో డీఎన్ఏ, మే బేబీ అనే రెండు టైటిల్స్‌తో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. నిన్న థియేటర్లలో విడుదలై ఇవాళ ఓటీటీ రిలీజ్ కావడంతో డీఎన్ఏ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇకపోతే డీఎన్ఏ సినిమా ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. సైకలాజికల్, యాక్షన్ అంశాలను కూడా కాస్తా టచ్ చేశారు.

ఓటీటీ విడుదల విశేషాలు

హాస్పిటల్‌లో పుట్టిన బిడ్డలను పురిటిలో మార్చే స్కామ్‌ గురించి ఈ సినిమా సాగుతుంది. ఆనంద్ బ్రేకప్ కావడంతో తాగుడుకు బానిస అవుతాడు. కుటుంబ సభ్యుల బలవంతంతో రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని దివ్యను ఆనంద్‌కు ఇచ్చి పెళ్లి చేస్తారు.

అయితే, దివ్య ఓ మానసిక సమస్యతో దివ్య బాధపడుతుందని తెలిసిన ఆనంద్ పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి కొన్ని నెలలకు బాబు పుడతాడు. ఇంక్యుబేటర్‌లో బాబును పెట్టి తీసుకొచ్చేసరికి తనకు పుట్టిన బాబు కాదని దివ్య గొడవ చేస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే డీఎన్ఏ తెలుగులో మై బేబీ కథ.

చివరగా, ‘డీఎన్ఏ’ (మై బేబీ) సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. పురిటిలోనే బిడ్డ మార్పిడి వంటి ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.