
📌 Key Points
- D/O ప్రసాదరావు: తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ZEE5లో విడుదలైన రివేంజ్ మిస్టరీ సిరీస్!
- కూతురు కనిపించకుండా పోవడంతో తండ్రి పడే ఆవేదన, వెతుకులాట హృదయాలను కదిలిస్తుంది.
- రాజీవ్ కనకాల, ఉదయభాను, గాయత్రి భార్గవి నటన అద్భుతం, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
- పోలూరు కృష్ణ దర్శకత్వంలో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ వారి నిర్మాణ విలువలు ప్రశంసనీయం!
ప్రతి తండ్రి కూతురు చూడాల్సిన రివేంజ్ మిస్టరీ D/O ప్రసాదరావు. ZEE5లో విడుదలైన ఈ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. రాజీవ్ కనకాల నటన అద్భుతంగా ఉంది. మిస్ అవ్వకుండా చూసేయండి.
కూతురు మిస్సింగ్: తండ్రి ఆవేదన!
ప్రస్తుత సమాజంలోనే కాదు.. ఏనాటి నుంచో ఆడపిల్లలు పుట్టారంటే చాలు.. ఆ కన్నతండ్రికి ఏదో తెలియని భయం మొదలవుతుంది. పిల్లని పెంచి, పెద్దచేసి, ఓ అయ్యచేతిలో పెట్టేంతవరకూ ఆ భయం గుప్పిట్లోనే బతుకుతూ పైకి నిబ్బరంగా కనిపిస్తాడు. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలన్న నానుడి ఉంది. దాన్ని బట్టే.. ఇప్పుడిప్పుడే కొందరు తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లాగా మసలుకుంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయం ఫ్రెండ్లీ పేరెంటింగ్ చాలా అవసరం. అమ్మో.. ఈ విషయం చెప్తే అమ్మ ఏమంటుందో.. నాన్న కోప్పడుతాడేమో అన్న భయంతో పెంచడం వల్ల వాళ్లకున్న ఇబ్బందులు, భయాలను సూటిగా చెప్పలేక లోలోపలే కుమిలిపోయిన, కుమిలిపోతోన్న ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. అలాంటి నేపథ్యంతోనే ఓ వెబ్ సిరీస్ వచ్చింది.
ఆడపిల్లల్ని భయంతో కాదు.. ధైర్యంతో పెంచాలని, ఎక్కడున్నా ధైర్యంగా నిలబడేలా పెంచాలని చాటిచెప్తూ.. ఇటీవలే ZEE5లో వెబ్ సిరీస్ విడుదలైంది. అదే D/O ప్రసాదరావు కనుబడుటలేదు. ఈ సిరీస్ లో వచ్చే ట్విస్ట్.. అందరిలోనూ కనువిప్పు కలిగిస్తుంది. నేటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితుల్నే ఇందులో కంటికి కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్ పోలూరు కృష్ణ. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఉదయభాను, గాయత్రి భార్గవి, జెమిని సురేశ్ కీలక పాత్రలు పోషించగా.. చైల్డ్ ఆర్టిస్ట్ వసంతిక D/O ప్రసాదరావుగా స్వాతి క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది.
స్టోరీలోకి వెళ్తే.. మాదాపూర్ లోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో యువతి మిస్సవ్వడం కలకలం రేపుతుంది. ఆ హాస్టల్లోనే ఓ అమ్మాయి మీడియా ఛానల్లో పనిచేస్తుండటంతో విషయం మీడియాకు లీకవుతుంది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ కోసం రెబెకా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. ఇంతలో ప్రసాదరావు తన కూతురి ఫోన్ రాత్రి నుంచి స్విచ్ఛాఫ్ వస్తుండటంతో నెల్లూరు నుంచి కారులోనే హైదరాబాద్ లో కూతురు ఉంటే హాస్టల్ కి చేరుకుంటాడు. అక్కడ హడావిడి చూసి కంగారుగా తన కూతురి గురించి అడగ్గా.. మిస్సైందని చెప్తారు. దాంతో అతను కుప్పకూలిపోయి.. కూతురి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు.
రివేంజ్ మిస్టరీ: ట్విస్టులు అదిరిపోలా!
స్వాతి (వసంతిక) పుట్టినప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచిన ప్రసాదరావు (రాజీవ్ కనకాల).. జాబ్ కోసం హైదరాబాద్ కు పంపడం ఇష్టలేదని మొండికేస్తాడు. తండ్రితో ధైర్యంగా మాట్లాడలేని స్వాతి.. తన మామయ్య, బాబాయ్ ల సహాయంతో ఏదోలా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేందుకు ఒప్పిస్తుంది. కూతురిని దగ్గరుండి హాస్టల్లో జాయిన్ చేసి.. ఆఫీసుకు కూడా తీసుకెళ్తాడు తండ్రి. అక్కడ కూతురు మాట్లాడే విధానం, పనిచేసే చోటు చూసి భావోద్వేగానికి గురవుతాడు. పుట్టినప్పటి నుంచి ఇల్లు, స్కూల్, చుట్టాలు తప్ప మరో ప్రపంచం తెలియని కూతురు కనిపించడం లేదని తెలిసి షాకవుతాడు. పోలీసులు కూడా కనుగొనలేని స్వాతిని ప్రసాదరావు కనుక్కుంటాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. హాస్టల్ సీసీటీవీల్లో ఎక్కడా బయటికెళ్లినట్లు కనిపించని స్వాతి ఎలా చనిపోయింది? ప్రసాదరావుకు ఆమె ఉన్న చోటు ఎలా తెలిసింది? స్వాతిపై అంతటి దారుణానికి పాల్పడిందెవరు? పోస్టుమార్టం రిపోర్టు చూసిన రెబెకా ఎందుకు షాకయింది? కేసు క్లోజయ్యాక అసలు నిందితులు ఏమయ్యారు? అన్నదే మిగతా సిరీస్.
రాజీవ్ కనకాల ఏ పాత్రలో నటించినా.. అది నటనలా కనిపించదు. ఆ పాత్రలో జీవిస్తారు. ఓ బాధ్యతగల తండ్రిగా ప్రసాదరావు క్యారెక్టర్లో కూడా ఆయన జీవించారు. కూతురిగా వసంతిక కూడా స్వాతి పాత్రకు న్యాయం చేసింది. తండ్రంటే అమితమైన ప్రేమ.. కానీ ఎప్పుడూ ఫ్రెండ్లీగా మాట్లాడకపోవడంతో ఎంతో ఇబ్బంది పడింది. ఈ ఎమోషన్లను తెరపై చాలా బాగా చూపించింది. హాస్టల్ వార్డెన్ గా భవాని క్యారెక్టర్లో గాయత్రి భార్గవి చాలా బాగా నటించింది. నిజానికి ఆమె సాఫ్ట్ క్యారెక్టర్లే ఎక్కువగా చేసింది. ఇలాంటి రోల్స్ చేయడం చాలా అరుదు. ఇక ఉదయభాను కూడా కేసునే ఛేదించే పోలీస్ ఆఫీసర్ రోల్ లో ఇమిడిపోతుంది. ఇక సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ కు అదే ప్లస్. కొన్ని సీన్లలో BGM వల్లే భావోద్వేగం పండింది. శ్రీరామ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ D/O ప్రసాదరావుకు ప్లస్ అయింది. ఫ్యామిలీ, రివేంజ్ అండ్ ట్విస్టులతో దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుంది. సిరీస్ చివరిలో ఇచ్చిన మెసేజ్.. ప్రస్తుత సమాజంలో ప్రతీ తల్లి -తండ్రులకు చాలా అవసరం. యువత కూడా ఈ సిరీస్ ను చూస్తే.. మనచుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటివాళ్లో, ఎవరు , ఎందుకు మనతో మంచిగా మసలుకుంటున్నారో తెలుస్తుంది.
రాజీవ్ కనకాల నటనకు ప్రశంసలు!
పిల్లలకు తల్లిదండ్రులు కనీస వసతులతో పాటు చదువును చెప్పించడం ఎంత ముఖ్యమో.. ఏ విషయాన్నైనా ముందు పేరెంట్స్ తో చెప్పుకునే స్వేచ్ఛనివ్వడం కూడా అంతే ముఖ్యం.
చివరిగా.. D/O ప్రసాదరావు .. ప్రతీ తండ్రి, ప్రతీ కూతురు కచ్చితంగా చూడాల్సిన సిరీస్.
D/O ప్రసాదరావు సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


