|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘బాహుబలి 3’ ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్

Published: 30-10-2025, 9:33 AM
'బాహుబలి 3' ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్

దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల బాహుబలి చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘బాహుబలి ది ఎపిక్’ రీ-రిలీజ్ సందర్భంగా రాజమౌళి, ప్రభాస్, రానా పాల్గొన్న ఇంటర్వ్యూలో ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ అనే 3D యానిమేషన్ మూవీని 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు.

Key Points

1

రాజమౌళి, ప్రభాస్, రానా బాహుబలి పదేళ్ల వేడుక ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

2

"బాహుబలి ది ఎటర్నల్ వార్" పేరుతో యానిమేషన్ మూవీ టీజర్ రాబోతోంది.

4

ఈ యానిమేషన్ చిత్రం బడ్జెట్ ఏకంగా 120 కోట్లు అని రాజమౌళి ప్రకటించారు.

బాహుబలి రీ-రిలీజ్, ప్రమోషన్స్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రం అక్టోబర్ 31న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు భాగాలని కలిపి ఒకే చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీనితో రాజమౌళి, ప్రభాస్, రానా ముగ్గురూ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. వీరు ముగ్గురూ మాట్లాడుతున్న ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.

బాహుబలి 3 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని గతంలోనే రాజమౌళి ప్రకటించారు. ఈ ఇంటర్వ్యూలో బాహుబలి 3కి సంబంధించిన చర్చ జరిగింది. బాహుబలి రెండు భాగాలు చితీకరిస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బందులు, బడ్జెట్ సమస్యలు, వాటిని అధికమించి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన విధానం వీటన్నింటి గురించి ప్రభాస్, రాజమౌళి, రానా మధ్య చర్చ జరిగింది.

‘బాహుబలి 3’ రూమర్లు.. నిజం ఏంటి?

రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలిలో తొలగించిన, ఎడిట్ చేసిన కొన్ని సీన్లు కూడా బాహుబలి ది ఎపిక్ లో యాడ్ చేస్తున్నాం అని జనాలు మాట్లాడుకుంటున్నారు. అది జస్ట్ రూమర్ మాత్రమే. యాడ్ చేసిన సీన్లు ఏమీ లేవు. మొత్తం ఆల్రెడీ సినిమాలో ఉన్న సీన్లే అని రాజమౌళి అన్నారు. మరి నాజర్ గారు ఎందుకు మళ్ళీ బాహుబలి ది ఎపిక్ కోసం డబ్బింగ్ చెప్పారు ? అని పక్కనే ఉన్న రానా ప్రశ్నించారు. దానిగురించే చెబుతున్నా అని జక్కన్న సమాధానం ఇచ్చారు.

ప్రకటించిన రాజమౌళి  బాహుబలిలో శివుడు తిరిగి మాహిష్మతికి వచ్చినప్పుడు నాజర్ డైలాగులు ఉంటాయి. బాహుబలిని చంపేశాం కదా, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే డైలాగులు ఉంటాయి. దానిని కనెక్ట్ చేస్తూ బాహుబలి ది ఎపిక్ ఇంటర్వెల్ లో ఒక టీజర్ ఉంటుంది. బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో ఈ టీజర్ రిలీజ్ చేస్తాం. అది బాహుబలి 3 గురించే ప్రకటన అనే రూమర్ కూడా జనాల్లో ఉంది. కానీ అది బాహుబలి 3 కాదు.

120 కోట్ల బడ్జెట్ యానిమేషన్ మూవీ

అది ఒక యానిమేషన్ మూవీ. యానిమేషన్ అంటే జనాల్లో చాలా సందేహాలు ఉంటాయి. కానీ ఇది 3డి యానిమేషన్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బాహుబలి 3 కాదు కానీ .. బాహుబలి 2కి కొనసాగింపుగానే ఉంటుంది అని రాజమౌళి తెలిపారు. దీనిపై ప్రస్తుతం శోభు యానిమేషన్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారట. దీని బడ్జెట్ ఏకంగా 120 కోట్లు అని రాజమౌళి ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా ప్రభాస్ కి మైండ్ బ్లాక్ అయింది. ఒక యానిమేషన్ చిత్రానికి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నారా అని ప్రభాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది బాహుబలి 1 బడ్జెట్ తో దాదాపుగా సమానం అని ప్రభాస్ తెలిపారు.

బాహుబలి 3 గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కొత్త వార్త. యానిమేషన్ చిత్రం 120 కోట్ల బడ్జెట్‌తో రావడం, బాహుబలి 2కి కొనసాగింపుగా ఉండటం సినిమా ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ కూడా ఈ బడ్జెట్ విని ఆశ్చర్యపోయారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.