
📌 Key Points
- సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును డిసెంబర్ 1న రెండో పెళ్లి చేసుకున్నారని వార్తలు.
- తన జీవితాన్ని అనేక విధాలుగా మార్చిన స్నేహితురాలు శిల్పా రెడ్డికి సమంత కృతజ్ఞతలు.
- శిల్పా రెడ్డి సూచనతో 15 నిమిషాల ధ్యానం తన జీవిత గమనాన్ని మార్చిందని సమంత పోస్ట్.
- నాగచైతన్యతో విడాకుల అనంతరం నాలుగేళ్లుగా ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు రెండో పెళ్లి.
సమంత రెండో పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. తన జీవితాన్ని మార్చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఆమె మాటల్లోనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సమంత రెండో పెళ్లి వార్తలు నిజమేనా?
సమంత ఈ సోమవారం(డిసెంబర్ 1న) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజ్ నిడిమోరుని ఆమె వివాహం చేసుకుంది. కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వీరిద్దరు ఎప్పుడో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని అంటున్నారు. సమంత చేతికి రింగ్‌ని చూసి ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితమే వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఓ వైపు ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరోవైపు సమంత లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంది సమంత. పెళ్లి సందర్భంగా తాను దిగిన పిక్స్ ని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. అయితే ఇందులో ఓ వ్యక్తి గురించి ఆమె ప్రత్యేకంగా పోస్ట్ పెట్టింది. తన లైఫ్‌ని మార్చింది ఆమెనే అని పేర్కొంది. ఆమె ఎవరు అనేది చూస్తే, సమంత గుర్తుచేసుకున్నది తన స్నేహితురాలు శిల్పారెడ్డి. ఆమె మోడల్, ఫ్యాషన్ డిజైనర్. సోషల్ యాక్టివిస్ట్ కూడా.
శిల్పా రెడ్డి ఎవరు? సమంతతో స్నేహం ఎలా?
సమంత, శిల్పారెడ్డి మంచి స్నేహితులు. కలిసి సాకి పేరుతో దుస్తుల కంపెనీని ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో తమ దుస్తులను అమ్ముతుంటారు. మహిళలకు సంబంధించిన లేటెస్ట్ డిజైన్స్ ని ఇందులో ఉంచుతారు. వాటికి సంబంధించిన అప్ డేట్లని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది సమంత. అదే సమయంలో నిత్యం ఆమెతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది సమంత.
తాజాగా పెళ్లి సందర్భంగా శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫోటోని పంచుకుంటూ, `నువ్వు నా జీవితాన్ని అనేక విధాలుగా చాలా మార్చేశావు. అదేంటో నీకు తెలుసు. నా ఈ బహుమతికి ధన్యవాదాలు. మీరు నన్ను 15 నిమిషాల ధాన్యంలోకి నెట్టారు. అది నిజంగా నా జీవిత గమనాన్ని మార్చివేసింది` అని పేర్కొంది సమంత. ఈ సందర్భంగా సమంత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సమంత జీవితాన్ని మార్చిన 15 నిమిషాల ధ్యానం
సమంత గతంలో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు ఆమె, చైతన్య ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోయారు. నాలుగేళ్లు ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరు హిందీలో `ది ఫ్యామిలీ మ్యాన్` సిరీస్‌లను రూపొందిస్తున్నారు. చివరగా `ది ఫ్యామిలీ మ్యాన్ 3` సిరీస్ కూడా విడుదలైంది. అయితే రెండో సీజన్‌లో సమంత నటించడం విశేషం. దీంతోపాటు `సిటాడెల్` సిరీస్‌లోనూ సమంత, రాజ్ నిడిమోరు కలిసి పనిచేశారు. ఇక ఇప్పుడు `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తోంది సామ్.
సమంత జీవితంలో శిల్పా రెడ్డి పాత్ర ఎంతో కీలకమని ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ధ్యానం ద్వారా సమంత తన జీవితాన్ని కొత్త కోణంలో చూసిందని, ఈ మార్పు ఆమెను మరింత బలమైన వ్యక్తిగా నిలిపిందని చెప్పవచ్చు.


