|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉత్తరకొరియాగా మార్చొద్దు

Published: 01-06-2025, 6:45 PM
ఉత్తరకొరియాగా మార్చొద్దు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీ అరెస్టుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఉత్తరకొరియాతో పోల్చారు.

Key Points

1

షర్మిష్ట పనోలీ అరెస్టును బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు.

2

పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా ఆమె క్షమాపణలు చెప్పారని కంగనా పేర్కొన్నారు.

4

నెదర్లాండ్స్ ఎంపీ గ్రీత్ వైల్డర్స్ కూడా పనోలీ అరెస్టును తప్పుబట్టారు.

కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ షర్మిష్ట పనోలీ అరెస్టును బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌పై కొందరు బాలీవుడ్‌ స్టార్లు ఎందుకు పెదవి విప్పలేదంటూ ఎక్స్‌లో వివాదాస్పద పోస్ట్‌ చేసినందుకు పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీ షి యల్‌ రిమాండ్‌ విధించడం తెలిసిందే. పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా అందుకామె క్షమాపణలు చెప్పారని కంగన గుర్తు చేశారు.

కనుక ఆమెను విడుదల చేసి దీన్ని ఇంతటితో వదిలేయాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగాక మరింతగా కక్షసాధింపుకు పాల్పడి రాష్ట్రాన్ని ఉత్తరకొరియాగా మార్చొద్దని సూచించారు. నెదర్లాండ్స్‌ ఎంపీ గ్రీత్‌ వైల్డర్స్‌ కూడా పనోలీ అరెస్టును తప్పుబట్టారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఆక్షేపించారు. ఆమె తక్షణ విడుదలకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

పనోలీ అరెస్టుపై వివాదం

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై చర్చ

షర్మిష్ట పనోలీ అరెస్టుపై కంగనా రనౌత్, నెదర్లాండ్స్ ఎంపీ వ్యక్తం చేసిన ఆందోళనలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.