|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ మృతి.. అయినా హ్యాపీ ఎండింగ్! ‘దూరదర్శిని’ సంచలన అప్డేట్ వైరల్!

Published: 13-05-2026, 5:30 AM
క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ మృతి.. అయినా హ్యాపీ ఎండింగ్! 'దూరదర్శిని' సంచలన అప్డేట్ వైరల్!
  • క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ చనిపోయినా సంతోషకర ముగింపు: సువిక్షిత్ సంచలన ప్రకటన.
  • ‘దూరదర్శిని’ మే 15న 250+ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల.
  • 90ల బ్యాక్‌డ్రాప్‌లో, నిజ జీవిత కథ ఆధారంగా ఎమోషనల్ జర్నీ.
  • మూడేళ్లు క్వాలిటీ కోసం కృషి: నూతన నటీనటులతో సహజత్వానికి ప్రాధాన్యత.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘దూరదర్శిని’ సినిమా గురించే చర్చ! క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ చనిపోయినా హ్యాపీ ఎండింగ్ ఉంటుందన్న వార్త సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. సువిక్షిత్ చెప్పిన ఈ సంచలన విషయాలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

క్లైమాక్స్ ట్విస్ట్: చనిపోయినా హ్యాపీ ఎండింగ్ ఎలా?

Suvikshit : సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని అనేది ట్యాగ్ లైన్. వారాహ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై జయశంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ నిర్మాణంలో కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దూరదర్శిని సినిమా మే 15న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హీరో సువిక్షిత్‌ నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ అని చెప్తూ.. రచయిత నారాయణ అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవితకథ ఆధారంగా ఈ కథను అనుకుని రాసుకున్నారు. మొదట వేరే హీరోతో చేద్దామని ప్లాన్‌ చేశాం కానీ కథకు కొత్తవాళ్ళైతే బాగుంటుంది అనుకోవడంతో నాకున్న ఇంట్రెస్ట్‌తో నేనే చేశాను అని తెలిపారు.

నిజ జీవిత కథ: 90ల నాటి ఎమోషనల్ జర్నీ!

ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 90s బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే కథ ఇది. నేను ఈసినిమాలో ప్రత్యేకంగా నటించలేదు. జస్ట్‌ ఆ టైమ్‌లో ఎలా ఉండేవాళ్ళో అలా బిహేవ్‌ చేశాను. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. సహజత్వం కోసం కొత్తవాళ్లతో సినిమా చేసాము. ప్రతి సినిమాకు ఉండే కష్టాలు మాకు కూడా ఉన్నాయి. ఈ సినిమాను క్వాలిటీ కోసం బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వటానికి మూడేళ్లు టైమ్‌ తీసుకున్నాం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ చనిపోతారు అయినా చివర్లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్‌ ఎలా ఇచ్చాం. అసలు అరుణాచలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు? ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ. యానాం, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాల్లో చాలా నేచురల్‌ లోకేషన్స్‌లో 90వ దశకం గుర్తొచ్చేలా ఈ సినిమా తీశాం అని అన్నారు.

రిలీజ్ ప్లాన్స్: 250+ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్!

సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. మేము వంద థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తే చాలు అనుకున్నాం కానీ ఇప్పడు దాదాపు 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. సిటీకి అలవాటు పడి అందరం మన మూలాలను, పల్లెట్లూర్లను మర్చిపోతున్నాం. ఈ సినిమా చూసిన వారికి వాళ్ల సొంతూరు గుర్తుకొస్తుంది. ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ ఎమోషన్‌ చూసి ఏడ్వకుండా ఎవ్వరూ ఉండలేరు అని అన్నారు.

క్లైమాక్స్ ట్విస్ట్, ఎమోషనల్ కథాంశంతో ‘దూరదర్శిని’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మే 15న థియేటర్లలో ఈ అద్భుత అనుభూతిని మిస్ అవ్వకండి. సినిమాకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.