
📌 Key Points
- దృశ్యం 3: ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్! మోహన్ లాల్ సంచలన ప్రకటన.
- మలయాళంలో షూటింగ్ పూర్తి! వెంకటేష్ తో తెలుగు రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది.
- ట్విస్టులు, ఉత్కంఠతో నిండిన దృశ్యం 3! రాంబాబుకి ఈసారైనా శిక్ష పడుతుందా?
- దృశ్యం, దృశ్యం 2 బ్లాక్ బస్టర్ విజయాలు! దృశ్యం 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దృశ్యం 3 వచ్చేస్తోంది! జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. రాంబాబు కథ ముగియనుందా? సస్పెన్స్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి!
ఏప్రిల్ 2న దృశ్యం 3 విడుదల!
Drishyam 3: దృశ్యం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన ఫ్యామిలీ కోసం ఆ ఇంటి పెద్ద ఎంతవరకైనా వెళతాడు అనే కథని ట్విస్టులు, టర్న్స్ తో చూపిస్తూ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో మెస్మరైజ్ చేశాడు జీతూ జోసెఫ్. ఇక ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ తో చేసిన విషయం తెలిసిందే. దృశ్యం, దృశ్యం 2 ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాయి.
మోహన్ లాల్ ప్రకటనతో ఫ్యాన్స్ సంబరాలు!
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 3(Drishyam 3) కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ మర్డర్ కేసులో హీరోకి శిక్ష పడుతుందా? పోలీసులకు ఏదైనా ఆధారం దొరికిందా? అసలు ఆ మర్డర్ కేస్ ఎలా క్లోజ్ అవుతుంది? దర్శకుడు ఈ సినిమాకు ఎలాంటి ముగింపు ఇవ్వనున్నాడు అనే విషయాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ చాలా ఎగ్జాయింటింగ్ గా ఉన్నారు.
వెంకటేష్ రీమేక్ లో రాంబాబు గెలుస్తాడా?
ఈ నేపధ్యంలోనే దృశ్యం 3 తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దృశ్యం 3 సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈమేరకు హీరో మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో అధికారిక పోస్ట్ పెట్టారు. దీంతో, దృశ్యం 3 కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ కూడా రీమేక్ చేస్తున్నాడు. మలయాళ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి ఫైనల్ గా రాంబాబు పోలీసులకు దొరుకుతాడా. లేదా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
దృశ్యం 3 విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రాంబాబు కథ ఎలా ముగుస్తుందో చూడటానికి వేచి ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


