|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Drishyam-3: దృశ్యం-3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచి స్టార్ట్ అంటే!

Published: 21-06-2025, 12:18 PM
Drishyam-3: దృశ్యం-3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచి స్టార్ట్ అంటే!

అజయ్ దేవగన్ నటించిన దృశ్యం సిరీస్‌కు మూడవ భాగం దృశ్యం-3 గురించి తాజా అప్డేట్ వచ్చింది. షూటింగ్ తేదీ, విడుదల తేదీల గురించి ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది.

Key Points

1

అజయ్ దేవగన్ నటించిన దృశ్యం-3 షూటింగ్ 2025 అక్టోబర్ 2న ప్రారంభం.

2

2026 గాంధీ జయంతి సందర్భంగా సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

4

దృశ్యం-3 చివరి అధ్యాయం అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ తెలియజేస్తుంది.

దృశ్యం-3 షూటింగ్ ప్రారంభ తేదీ

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgan) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘దృశ్యం’ ఒకటి. 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. మలయాళ చిత్రం దృశ్యం(2013)కి రీమేక్‌గా వచ్చిన ఈ మూవీలో అజయ్ దేవగన్ విజయ్ సాల్వాంకర్ పాత్రలో నటించి మెప్పించగా.. దీనికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించాడు. ఇందులో టబు, శ్రియ శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్, రజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో అజయ్ దేవగన్, అక్షయే ఖన్నా, టబు ప్రధాన పాత్రల్లో నటించగా.. దీనికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2022లో రిలీజైంది. ఇప్పుడు సినీ ప్రియులు దృశ్యం-3 కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్ట్‌-3 పై అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ట్వీట్ మేరకు.. ‘అజయ్ దేవగన్, దృశ్యం-3 షూటింగ్ అక్టోబర్ 2, 2025న ప్రారంభించనున్నారు.. 2026 గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.. మొత్తం సాల్వాంకర్ కుటుంబం మళ్లీ వచ్చింది.. ఈసారి, ఇది చివరి అధ్యాయం!’ అంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

సినిమా విడుదల తేదీ

సాల్వాంకర్ కుటుంబం తిరిగి వస్తుంది

అజయ్ దేవగన్, దృశ్యం-3 చివరి భాగం అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆశిద్దాం. 2026 లో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.