|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోస్ట్ వాంటెడ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ నుంచి రాబోతున్న మూడో సినిమా.. దృశ్యం 3 షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?

Published: 22-06-2025, 8:17 AM

సుపర్ హిట్ థ్రిల్లర్ సినిమాలైన దృశ్యం 1, 2 తర్వాత, దృశ్యం 3 సినిమా షూటింగ్‌కు సన్నద్ధమవుతోంది. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించడంతో అభిమానుల ఆసక్తి పెరిగింది.

Key Points

1

దృశ్యం 3 షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో మొదలవుతుంది.

2

మోహన్‌లాల్‌ ఇంటెన్స్ లుక్‌తో కనిపించే ప్రచార వీడియో విడుదలైంది.

4

తెలుగు, హిందీలోనూ రీమేక్‌లు విడుదలైన తర్వాత దృశ్యం 3 అంచనాలను పెంచుతోంది.

దృశ్యం 3 షూటింగ్ ప్రారంభం

అత్యంత ఫేమస్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి మరో సినిమా రాబోతోంది. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకూ క్షణక్షణం ఉత్కంఠ రేపే ఈ ఫ్రాంఛైజీ ఆడియన్స్ కు థ్రిల్ పంచిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది.

దృశ్యం 3 మూవీ షూటింగ్ పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలెట్టనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మోహ‌న్‌లాల్‌ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ‘‘గతమెప్పుడూ సైలెంట్ గా ఉండదు’’ అని పోస్టులో పేర్కొన్నారు.

దృశ్యం సిరీస్ విజయం

దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాలతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ మ్యాజిక్ చేశారు. ఈ ఫ్రాంఛైజీ తొలి రెండు థ్రిల్లర్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సినిమాకు కూడా జీతు జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ మూవీని నిర్మించనున్నారు. మరోసారి ఈ కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది.

దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిందే. ఒరిజినల్ మలయాళ భాషలో మోహ‌న్‌లాల్‌, మీనా లీడ్ రోల్స్ ప్లే చేశారు. తెలుగు, హిందీలోనూ ఈ సినిమాలు రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ , మీనా.. హిందీలో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. ఇప్పుడు హిందీలోనూ అజయ్ దేవగణ్ దృశ్యం 3 సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.

నటీనటులు మరియు దర్శకుడు

ఫ్యామిలీ కోసం పోలీస్ ఉన్నతాధికారిని ఎదురించే ఓ కామన్ మ్యాన్ కథే దృశ్యం. తన కూతురును వేధించే అబ్బాయిని హతమార్చే తండ్రి.. పోలీసులకు దొరకకుండా ఎత్తుల మీద ఎత్తులు వేస్తాడు. తన కొడుకును చంపిన వాళ్లను పట్టుకునేందుకు ఆ పోలీస్ అధికారి ఎంతకైనా తెగిస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులపై పోలీస్ ఇంటరాగేషన్ తో చేసే హింస, కేసులో దొరక్కుండా తప్పించే తండ్రి.. ఇలా సినిమా అంతా థ్రిల్ గా సాగుతుంది.

దృశ్యం 1, 2 సినిమాల విజయాల తర్వాత, దృశ్యం 3 పై అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న షూటింగ్ తో మరింత ఉత్కంఠ పెరిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.