
📌 Key Points
- దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు.
- పదేళ్ల తర్వాత సిబి మలయిల్ కుమారుడి వివాహంలో కలిసి కనిపించిన జంట.
- పిల్లల సంతోషం కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ప్రియదర్శన్, లిస్సీ.
- మళ్ళీ పెళ్లి అనేది కాగితంపై ఉండే సర్టిఫికెట్ మాత్రమే అంటున్న ఈ జంట.
ఒకప్పటి మలయాళ స్టార్ జంట ప్రియదర్శన్ మరియు లిస్సీ తిరిగి ఒక్కటయ్యారు. 2016లో విడాకులు తీసుకున్న ఈ జంట, పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వారి పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రియదర్శన్, లిస్సీల అనూహ్య కలయిక
Star Couple Reunion: మలయాళ చిత్రసీమలో ఒకప్పుడు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనిపించుకున్న జంట దర్శకుడు ప్రియదర్శన్ మరియు నటి లిస్సీ. 1990 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్న ఈ జంట 26 ఏళ్ల వైవాహిక బందాన్ని తెంచుకుని 2016లో వీరి 26 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిపోవడం అప్పట్లో ఒక పెద్ద షాక్. అయితే, సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ మాజీ దంపతులు మళ్ళీ ఒక్కటి కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కలయిక వెనుక ఉన్న ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవే..
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఏడాది జనవరిలో మలయాళ దర్శకుడు సిబి మలయిల్ కుమారుడి వివాహ వేడుకలో ప్రియదర్శన్, లిస్సీ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ ఒకే కారులో రావడం, వేదికపై లిస్సీ చేతిని ప్రియదర్శన్ పట్టుకుని నడవడం చూసిన అభిమానులు “వీరు మళ్ళీ కలిసిపోయారా?” అని సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ వార్త మెగాస్టార్ మమ్ముట్టి వరకు చేరడంతో ఆయన ఎంతో సంతోషించారట కూడా .
ప్రియదర్శన్, లిస్సీ ఇద్దరూ మమ్ముట్టికి ప్రాణ స్నేహితులు. మార్చి 16న లిస్సీ తన సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. అందులో ఆమె, ప్రియదర్శన్ మధ్యలో మమ్ముట్టి నిలబడి ఉన్నారు. చెన్నైలోని ప్రియదర్శన్ స్టూడియో ‘లే మ్యాజిక్ లాంతర్’లో మమ్ముట్టి తన కొత్త సినిమా ‘పేట్రియాట్’ డబ్బింగ్ కోసం వెళ్ళినప్పుడు ఈ మీటింగ్ జరిగింది. “మిమ్మల్ని ఇలా మళ్ళీ జంటగా చూడటం నాకెంతో సంతోషంగా ఉంది” అని మమ్ముట్టి ఆ దంపతులతో అన్నారట.అలా ఆ ఫోటోతో వీరిద్దరూ మళ్ళీ ఒకటి కావడం ‘అఫీషియల్’ అయిపోయింది.
పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్న జంట
వీరు మళ్ళీ కలవడానికి ప్రధాన కారణం వారి పిల్లలు కల్యాణి ప్రియదర్శన్ మరియు సిద్ధార్థ్. ఇటీవల కల్యాణి నటించిన ‘లోకా’ (Lokah) చిత్రం రూ. 270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకవైపు పిల్లలు కెరీర్‌లో దూసుకుపోతుంటే, వారి సంతోషం కోసం ప్రియదర్శన్, లిస్సీ గత విబేధాలను పక్కన పెట్టి కలిసి ఉండాలని సుమారు 8 నెలల క్రితమే డిసైడ్ అయ్యారట.
సాధారణంగా ఇలాంటి జంటలు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని ఆశిస్తారు. కానీ “మ్యారేజ్ అనేది కేవలం ఒక కాగితం మీద ఉండే సర్టిఫికెట్ మాత్రమే.మా మధ్య ఉన్న స్నేహం, ఒకరికొకరు తోడుగా ఉండటం, ఆ ప్రేమే మాకు ముఖ్యం” అని వారు నమ్ముతున్నారట. దీనిపై ప్రియదర్శన్ స్పందిస్తూ.. “అవును, మేము మళ్ళీ కలిసిపోయాం. ఆ ఒక్క సర్టిఫికెట్ తప్ప, మా జీవితంలో మళ్ళీ పాత రోజులు వచ్చాయి” అని కన్ఫాం చేశారు.
పెళ్లిపై వారి ఆలోచనలు ఏమిటంటే…
ఇక ప్రియదర్శన్ వ్యక్తిగత జీవితమే కాదు, కెరీర్ కూడా ఇప్పుడు ఫుల్ జోరులో ఉంది. ప్రియదర్శన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా ‘భూత్ బంగ్లా’ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ హారర్ కామెడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు 14 ఏళ్ల తర్వాత అక్షయ్ – ప్రియదర్శన్ కాంబో వస్తుండటం విశేషం.మొత్తానికి అటు వ్యక్తిగత జీవితం, ఇటు ప్రొఫెషనల్ లైఫ్.. ఇలా రెండింటిలోనూ ప్రియదర్శన్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
read also : రణ్‌వీర్ కోసం బారులు తీరిన టాలీవుడ్ స్టార్ హీరోలు… వెనుక ‘పొలిటికల్’ స్కెచ్ ఉందా?
ప్రియదర్శన్, లిస్సీల కలయిక వారి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. పిల్లల కోసం వారు తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారి స్నేహం ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.


