|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి వద్దన్న హీరోయిన్.. ఇప్పుడు పిల్లల కోసం తహతహలాడుతోందా? అసలు ఏమైంది?

Published: 08-07-2026, 1:18 AM
పెళ్లి వద్దన్న హీరోయిన్.. ఇప్పుడు పిల్లల కోసం తహతహలాడుతోందా? అసలు ఏమైంది?

కోలీవుడ్ నటి ఐశ్వర్య లక్ష్మి పెళ్లి, పిల్లలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు పెళ్లే వద్దన్న ఈ బ్యూటీ, ఇప్పుడు బిడ్డల్ని కనాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అభిప్రాయం మారడానికి గల కారణాలు, ఆమె షరతులు ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

ఒకప్పుడు పెళ్లే వద్దన్న కోలీవుడ్ నటి ఐశ్వర్య లక్ష్మి.

2

'గట్టకుస్తీ 2' షూటింగ్ సమయంలో చిన్నారితో గడిపి మాతృత్వంపై కోరిక.

4

బిడ్డను కని మాతృత్వపు క్షణాలను ఆస్వాదించాలనే ఆకాంక్ష.

పెళ్లిపై ఐశ్వర్య లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

Kollywood:పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క మహిళ పిల్లల్ని కని.. తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటుంది . అయితే పిల్లల్ని కనడానికి పెళ్లితో సంబంధం ఏంటి? అని అడిగే సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. మరికొంతమంది పిల్లలే వద్దు అంటూ ఒత్తిడి తెచ్చిన భాగస్వాములతో విడాకులకు సిద్ధమవుతున్నవారు కూడా ఉన్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలకు తగ్గట్టుగా తమ జీవితాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు పెళ్లే వద్దన్న ఒక బ్యూటీ ప్రస్తుతం పెళ్లిపై తన అభిప్రాయాలను మార్చుకుందేమో తెలియదు కానీ ప్రస్తుతం అలాంటి మగాడు దొరికితే బిడ్డను కంటాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆమె ఎవరో కాదు ఐశ్వర్య లక్ష్మి. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ గట్ట కుస్తీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గట్టకుస్తీ 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. జూలై 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితం, పెళ్లి గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..” గట్ట కుస్తీ 2 సినిమా షూటింగ్ సమయంలో ఒక చిన్నారితో గడిపే అవకాశం వచ్చింది. ఆ పాపకు దగ్గర అయినప్పుడు నాలోని మాతృత్వపు భావాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఒక బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక నాలో కలిగింది అంటూ కామెంట్ చేసింది. ఈ వార్తలు విన్న నెటిజన్స్ ఒకప్పుడు పెళ్లి పై నమ్మకం లేదు.. పెళ్లి వద్దున్న బ్యూటీ ఇప్పుడు పిల్లల్ని కనాలని ఉంది అని అంటోంది ఏంటి ?అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మాతృత్వపు భావాలు మేల్కొన్నాయి: ఐశ్వర్య లక్ష్మి

ఇదే ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. “ఆ పాపను దగ్గరగా చూసిన తర్వాత నాలోని మాతృత్వపు లక్షణాలు మేల్కొని ఒక బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక కలిగింది. అందుకే నాకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి అంటే.. భవిష్యత్తులో నాకంటూ ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను కాబట్టి.. కనీసం నా పిల్లలకు ఒక మంచి తండ్రి అవుతాడనే నమ్మకం నాలో కలగాలి. ఏ కష్టం వచ్చినా నన్ను వదిలి పారిపోని ఒక తోడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అలాంటి వ్యక్తితోనే నేను ఒక బిడ్డను కని , మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తాను అంటూ ఐశ్వర్య లక్ష్మి కామెంట్లు చేసింది.

తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి?

ఐశ్వర్య లక్ష్మీ విషయానికొస్తే.. కేరళకు చెందిన మలయాళ బ్యూటీ.. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసింది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి తమిళంలో జగమే తందిరం, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు గట్ట కుస్తీ 2 చిత్రంతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను తెలుగులో మట్టి కుస్తీ 2 పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు నేటి యువత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. మాతృత్వం పట్ల ఆమెకున్న ఆకాంక్ష, సరైన భాగస్వామి కోసం ఆమె ఎదురుచూపులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.