|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SHOCKING: కలర్స్ స్వాతి సీక్రెట్ గా రెండో పెళ్లి! డైరెక్టర్ శ్రీకాంత్ నగోటిని వివాహం చేసుకున్న స్వాతి రెడ్డి

Updated: 09-07-2026, 12:57 AM
SHOCKING: కలర్స్ స్వాతి సీక్రెట్ గా రెండో పెళ్లి! డైరెక్టర్ శ్రీకాంత్ నగోటిని వివాహం చేసుకున్న స్వాతి రెడ్డి

టాలీవుడ్ లో సంచలనం! కలర్స్ స్వాతి రెండో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ శ్రీకాంత్ నగోటిని సీక్రెట్ గా వివాహం చేసుకున్న స్వాతి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Key Points

1

కలర్స్ స్వాతి రెండో పెళ్లి: డైరెక్టర్ శ్రీకాంత్ నగోటిని సీక్రెట్ గా వివాహం చేసుకుంది.

2

స్వాతి మొదటి పెళ్లి విడాకుల తర్వాత మంథ్ ఆఫ్ మధు ఫేం దర్శకుడితో ప్రేమ, పెళ్లి.

4

స్వాతి రెండో ఇన్నింగ్స్: పంచతంత్రం, మంథ్ ఆఫ్ మధు సినిమాలతో తిరిగి టాలీవుడ్ లోకి.

స్వాతి రెండో పెళ్లి: డైరెక్టర్ శ్రీకాంత్ నగోటితో ప్రేమ వివాహం

తెలుగు టెలివిజన్ రంగంలో ‘కలర్స్’ అనే ఒకే ఒక్క షోతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి. ఆ తర్వాత వెండితెరపై కూడా ‘అష్టా చమ్మా’, ‘స్వామి రారా’ వంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా స్వాతి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆమె ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతి రెడ్డి దర్శకుడు, ‘మంథ్ ఆఫ్ మధు’ ఫేం శ్రీకాంత్‌ నగోటిను పెళ్లి చేసుకుంది.

విడాకుల తర్వాత కొత్త అధ్యాయం: స్వాతి జీవితంలో మళ్లీ ప్రేమ

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రమంలోనే, యువ దర్శకుడు శ్రీకాంత్‌ నగోటితో స్వాతికి పరిచయం ఏర్పడింది. కథా చర్చలు, సినిమా ప్రయాణంలో వీరిద్దరి ఆలోచనలు, మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం చాలా నిశ్శబ్దంగా, ప్రైవేట్‌గా జరిగినట్లు సమాచారం. సంప్రదాయ పద్దతిలో పెళ్లి జరుగగా.. స్వాతి రెడ్డి తన భర్త చేయి పట్టుకున్న ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

స్వాతి 2018లో మలయాళీ అయిన వికాస్ వాసు అనే అంతర్జాతీయ పైలట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమై ఇండోనేషియాలో స్థిరపడ్డింది. అయితే, దురదృష్టవశాత్తూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియా ఖాతాల నుండి భర్త ఫోటోలను తొలగించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాల నుండి కోలుకోవడానికి స్వాతి కొంత సమయం తీసుకున్నారు.

సీక్రెట్ వెడ్డింగ్: స్వాతి ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేసిన వైనం

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, స్వాతి ధైర్యంగా ముందడుగు వేశారు. మళ్లీ తన నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని ‘పంచతంత్రం’, ‘మంత్ ఆఫ్ మధు’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈసిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డ స్వాతీ.. తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు స్వాతికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

స్వాతి రెడ్డి రెండో పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ జంటకు అభిమానుల నుండి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.