
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కాటేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజమేంటో తెలుసుకోండి.
Key Points
రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సమయంలో విషపురుగు కాటు వార్తలు వైరల్.
రాజేష్ శర్మ పీఏ వీడియో రిలీజ్ చేసి ఆరోగ్యం నార్మల్ అని క్లారిటీ ఇచ్చారు.
డయాబెటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ.
వైరల్ న్యూస్‌పై క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్స్ లో విషాదం జరిగినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ రాజేశ్ శర్మ కాలికి విషపు పురుగు కాటేసిందని వార్తలు వస్తున్నాయి. తొలుత ఏదో సాధారణ పురుగే అనుకొని నిర్లక్ష్యం చేశారని, ఆరు గంటల తర్వాత తీవ్రమైన నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడడంతో ఆసుపత్రికి తరలించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజేశ్ శర్మ వ్యక్తిగత సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. రాజేశ్ శర్మ ప్రస్తుతం కోల్ కతాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి కాస్త విషయంగానే ఉన్నట్లు వార్తలు వైరల్ కావడంతో ఆయన పీఏ సుభాశిష్ పాండా స్పందించాడు. ‘ఫౌజీ’ షూటింగులో నటుడుకి విషపురుగు కరించిందనే ప్రచారాన్ని ఖండిస్తూ, ఒక వీడియో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, మధుమేహం (డయాబెటిస్) కారణంగా రాజేష్ శర్మ ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, గురువారం డిశ్చార్జ్ అవుతానని తెలిపారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామా అని టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తదుపరి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో, సెట్స్ లో నటుడు రాజేష్ శర్మని విషపురుగు కాటేసినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు కలవరపడ్డారు. ఆయనకు షూటింగులో ఏమీ జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. * సైలెంట్‌గా టాలీవుడ్ దర్శకుడిని రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ‘ఫౌజీ’ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి కమల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. టీ సిరీస్, గుల్షన్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజేష్ శర్మ ఆరోగ్యం నార్మల్
ప్రభాస్ ఫౌజీ అప్‌డేట్స్
ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఈ వార్తలతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. రాజేష్ శర్మ ఆరోగ్యం నార్మల్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి.


