
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ ట్రైలర్ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 17న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ట్రైలర్‌పై పూర్తి విశ్లేషణ చూడండి.
Key Points
ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'డ్యూడ్' సినిమా వస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్.
నవంబర్ 17న దీపావళి కానుకగా 'డ్యూడ్' విడుదల.
ట్రైలర్ రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోంది.
‘డ్యూడ్’ సినిమా విశేషాలు, నటీనటులు
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు మరో మూవీతో వచ్చేస్తున్నాడు. అదే ‘డ్యూడ్’. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకుడు. దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ విశ్లేషణ: కథ, ఎమోషన్స్
ప్రదీప్ స్వతహాగా దర్శకుడు. కానీ హీరోగా లవ్ టుడే, డ్రాగన్ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ చేశాడు. ‘డ్యూడ్’ కూడా అదే జానర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అయితే ఈసారి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్‌తో చెప్పకనే చెప్పారు. ప్రదీప్-మమిత ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి అనేసరికి మమిత నో చెప్పేస్తుంది. తర్వాత ప్రదీప్.. నేహాశెట్టితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.
దీపావళికి ‘డ్యూడ్’ విడుదల, పోటీ సినిమాలు
ట్రైలర్లో కథని చెప్పి చెప్పనట్లు చూపించారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ‘డ్యూడ్’తో పాటు దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. వీటితో పోటీలో మరి ‘డ్యూడ్’ ఏం చేస్తాడో చూడాలి?
‘డ్యూడ్’ ట్రైలర్ మంచి రొమాంటిక్, ఎమోషనల్ కథను సూచిస్తోంది. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్. దీపావళి బరిలో నిలుస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


