|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నడ ప్రజలకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు, కారణం ఏంటో తెలుసా?

Published: 04-09-2025, 3:19 AM
కన్నడ ప్రజలకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు, కారణం ఏంటో తెలుసా?

యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ సినిమాలోని ఒక డైలాగ్ కారణంగా కన్నడ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ వివాదం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

దుల్కర్ సల్మాన్ నిర్మించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ సినిమాలోని డైలాగ్‌పై వివాదం.

2

కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు.

4

సినిమా బాక్సాఫీస్ విజయం సాధిస్తున్న సమయంలోనే ఈ వివాదం.

‘లోక చాప్టర్ 1 చంద్ర’ సినిమాపై వివాదం

హీరోగా నిర్మాతగా దూసుకుపోతున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా ఆయన నిర్మించిన సినిమా ‘లోక చాప్టర్ 1 చంద్ర’. ఈ చిత్రంలో ఒక డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అన్న విమర్శల నేపథ్యంలో, దుల్కర్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందించి క్షమాపణలు తెలిపింది. ఇటీవల మలయాళంలో విడుదలై విజయవంతమైన ఈ చిత్రం, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు వచ్చాయి.

కన్నడ ప్రజల ఆగ్రహం

అంతే కాదు ఈసినిమాలో ‘దగర్’ అనే పదం వాడటం కూడా పలువురు సోషల్ మీడియా వినియోగదారుల ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో, కర్ణాటకకు చెందిన నెటిజన్లు, ప్రజలు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించడంతో, దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేఫరర్ ఫిల్మ్స్ తరపున వచ్చిన ఆ ప్రకటనలో వారు ఇలా తెలిపారు. “మా సినిమాలోని ఒక సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసిందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై మేము నిజంగా చింతిస్తున్నాం. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఆ సంభాషణను వీలైనంత త్వరగా సినిమా నుండి తొలగించడం లేదా మార్చడం జరుగుతుంది. మేము కలిగించిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మా క్షమాపణను అంగీకరించండి.” అని చిత్ర బృందం తెలిపింది.

దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ స్పందన

ఈ చిత్రాన్ని డామినిక్ అరుణ్ డైరెక్ట్ చేయగా, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. నస్లేన్ ప్రధాన పాత్రలో పోషించారు. 2025 ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలై మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధిస్తున్న సమయంలోనే ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై చిత్ర యూనిట్ బాధ్యతాయుతంగా స్పందించి, వెంటనే మార్పులు చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు ఈమధ్య కామన్ గా మారాయి. ఈ క్రమంలో కన్నడ ప్రజలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎమైనా స్పందన వస్తుందో లేదో చూడాలి.

దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు తెలిపినప్పటికీ, కన్నడ ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ వివాదం సినీ పరిశ్రమలోని సంభాషణలపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చూపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.