|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హీరోయిన్ నాకు చెల్లి లాంటిది.. మేమిద్దరం ఒకేలా ఉంటాం.. లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ కామెంట్స్

Published: 04-09-2025, 4:53 AM
ఆ హీరోయిన్ నాకు చెల్లి లాంటిది.. మేమిద్దరం ఒకేలా ఉంటాం.. లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ కామెంట్స్

‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ నిర్మించిన ‘కొత్త లోకం 1: చంద్ర’ సినిమా విజయవంతమైంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Key Points

1

దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'కొత్త లోకం 1: చంద్ర' సినిమా సంచలన విజయం సాధించింది.

2

కల్యాణి ప్రియదర్శన్ తన చెల్లి లాంటిదని దుల్కర్ సల్మాన్ వెల్లడించాడు.

4

సినిమా టీంపై దుల్కర్ సల్మాన్ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

కొత్త లోకం విజయోత్సవం

సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. నిర్మాతగా దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ సినిమా ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.

డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ కల్యాణి ప్రియదర్శన్, ప్రేమలు హీరో నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదల చేశారు.

విడుదలైన మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా కొత్త లోక దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 3) సాయంత్రం హైదరాబాద్‌లో కొత్త లోక విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆ హీరోయిన్ తన చెల్లి అంటూ దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యలు

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మేము ఏడు సినిమాలు నిర్మించాము. కొత్త లోక కోసం ఇంత మంచి టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారు” అని అన్నాడు.

“ఉత్తమ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణుల మద్దతుతోనే ఇంత గొప్ప సినిమా చేయగలిగాము. నిర్మాతగా నేను వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్‌కి మహా అయితే ఒక్కసారి వెళ్లి ఉంటాను. అంతలా నేను టీంని నమ్మాను. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి నాకు మంచి స్నేహితుడు. అతని వల్లే ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కథ వినగానే నిర్మించడానికి ముందుకొచ్చాను” అని దుల్కర్ సల్మాన్ చెప్పాడు.

“ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ ఇవన్నీ ఆలోచించలేదు. అందరూ తమ డ్రీమ్‌లా ఈ సినిమా కోసం పని చేశారు. మేము ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలేదు. అదంతా ఇలాంటి అద్భుతమైన టీం వల్లే సాధ్యమైంది” అని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.

కల్యాణి ప్రియదర్శన్ పై ప్రశంసలు

“డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు. డొమినిక్ అరుణ్, నిమిష్ రవి కలిసి అది నిజమని మరోసారి నిరూపించారు. మా సినిమాని తెలుగులో విడుదల చేసిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు” అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నాడు.

” కల్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లి లాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాము, ఒకేలా ఆలోచిస్తాము. చంద్ర పాత్ర కోసం కళ్యాణి తప్ప మా మైండ్‌లోకి వేరే ఎవరి పేరు రాలేదు. కొత్త లోక సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నన్ను ఎలాగైతే మీ వాడిగా భావించారో, అలాగే కొత్త లోకను కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అని దుల్కర్ సల్మాన్ తన స్పీచ్ ముగించాడు.

‘కొత్త లోకం 1: చంద్ర’ సినిమా విజయానికి దుల్కర్ సల్మాన్ తన టీంను అభినందించాడు. కల్యాణి ప్రియదర్శన్ తో తన అనుబంధాన్ని తెలియజేస్తూ, సినిమా నిర్మాణంలో తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.