|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలో GV ప్రకాష్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

Published: 13-06-2025, 12:12 PM
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలో GV ప్రకాష్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించే ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు GV ప్రకాష్‌ను ఎంపిక చేశారని చిత్ర యూనిట్ ప్రకటించింది. GV ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Key Points

1

దుల్కర్ సల్మాన్ నటించే 'ఆకాశంలో ఒక తార' సినిమాకు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

2

GV ప్రకాష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

4

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు GV ప్రకాష్ సంగీతం

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తు్న్న చిత్రాల్లో ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamolo Oka Taara) ఒకటి. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు సినిమాగా రాబోతుండగా.. దీనిని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇందులో నుంచి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్డేట్ రాలేదు.

పుట్టిన రోజు సందర్భంగా ప్రకటన

ఈ క్రమంలోనే తాజాగా ‘ఆకాశంలో ఒక తారా’ బోర్డులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ (GV Prakash) జాయిన్ అయినట్లు తెలిపారు. ఈ రోజు GV ప్రకాష్ పుట్టిన రోజు కావడంతో.. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘స్టార్స్‌కి ఆకాశాన్ని తాకే సౌండ్‌ట్రాక్ ప్రయాణం అవసరం.. మ్యూజికల్ స్టార్ GV ప్రకాష్ బర్త్‌డే సందర్భంగా.. ఆయనను ‘ఆకాశంలో ఒక తార’ బోర్డ్‌లోకి బృందం హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది’ అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల

A journey to the STARS needs a soundtrack that touches the SKY 😍🫶🏻 Team #AakasamLoOkaTara warmly welcomes the Musical Star @gvprakash on board on his birthday ❤️‍🔥 #HBDGVPrakash #AOTMovie @dulQuer @GeethaArts @SwapnaCinema @Lightboxoffl @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam … pic.twitter.com/ed4di8wzoj

చివరగా, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు GV ప్రకాష్ సంగీతం అందించడం చిత్ర యూనిట్‌కు పెద్ద బలం. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.