
📌 Key Points
- ‘డ్యూన్ 3’ టికెట్ ధర రీసేల్ మార్కెట్‌లో రూ. 90,000 పలుకుతున్నా కొనేందుకు ఎగబడుతున్న సినీ అభిమానులు!
- డిసెంబర్ 18న విడుదల కానున్న ‘డ్యూన్ 3’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూపు!
- అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఐమ్యాక్స్ 70mm స్క్రీన్స్ కొరతతో టికెట్ల ధరలకు రెక్కలు!
- ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల సంఖ్యను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్న ‘డ్యూన్ 3’ మూవీ డైహార్డ్ ఫ్యాన్స్!
హాలీవుడ్ మూవీ ‘డ్యూన్ 3’ రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. టికెట్ల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నా, సినిమా చూడాలనే ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 90,000కు ‘డ్యూన్ 3’ టికెట్.. ఎక్కడో తెలుసా?
కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే బెనిఫిట్ షోలకు టికెట్స్ రేట్స్ పెంచడం కామన్. సాధారణంగా ఇవి రూ. 1000 వరకు ఉంటాయి. కానీ ఓ సినిమాకు మాత్రం ఫ్యాన్స్ ఏకంగా రూ. 90,000 వేలు పెట్టి టికెట్ కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ మేనియా వరల్డ్ వైడ్‌గా అప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఐమ్యాక్స్ 70mm టికెట్లు బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోవడం ఇప్పుడు షాకింగ్‌గా మారింది. ‘డ్యూన్ 3’ ఒక్కో టికెట్ ధర ప్రస్తుతం రీసేల్ మార్కెట్‌లో ఏకంగా రూ. 90,000 వరకు పలుకుతుంది. అయినా కూడా అమ్ముడు పోవడంతో ఈ సినిమా కోసం సినిమా లవర్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అంతే కాకుండా.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. అయితే..ఈ టికెట్ ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm స్క్రీన్స్ కొరత. అమెరికా అండ్ యూకే మొత్తం కలిపి కేవలం 19 లొకేషన్లలో మాత్రమే ఈ స్పెషల్ ఫార్మాట్ అందుబాటులో ఉందని తెలుస్తుండగా… స్క్రీన్స్ కొరత, డిమాండ్ ఎక్కువ ఉండటంతో బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల రేట్లు ఏకంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తక్షణమే ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తుంటే.. ‘డ్యూన్ 3’ ఐమ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.
టికెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్.. కారణం ఇదే!
ఐమ్యాక్స్ స్క్రీన్స్ పెంచాలంటున్న సినీ ప్రియులు!
‘డ్యూన్ 3’ సినిమా టికెట్ల రేట్లు పెరగడం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


