
📌 Key Points
- ‘దురంధర్’ సినిమా బాలీవుడ్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ.940 కోట్లకు పైగా వసూలు చేసింది.
- దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తోనే అంచనాలకు మించి విజయం సాధించింది.
- రామ్ గోపాల్ వర్మ ‘దురంధర్’ను ‘భయపెట్టే కుక్క’తో పోల్చుతూ, ఇండస్ట్రీని వణికించిందని పేర్కొన్నారు.
- పెద్ద సినిమాలు చేసే మేకర్స్‌కు ‘దురంధర్’ ఒక హారర్ సినిమా లాంటిదని, దాని పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు.
బాలీవుడ్‌లో రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ సినిమా అనూహ్య విజయం సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై షాకింగ్ పోస్ట్ చేశారు. ‘దురంధర్’ విజయం ఇండస్ట్రీని ఎలా భయపెడుతుందో ఆయన తనదైన శైలిలో వివరించారు.
‘దురంధర్’ సంచలన విజయం: బాక్సాఫీస్ వద్ద రికార్డులు!
Ram Gopal Varma: బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ‘దురంధర్’. URI మూవీ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచనాలు క్రియేట్ చేస్తోంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది ఈ మూవీ. విడుదలైన 20 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.940 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ పుట్టస్వామి లేటెస్ట్ ఫొటోస్.. ఎంత క్యూట్ ఉందో చూడండి..
వర్మ సంచలన వ్యాఖ్యలు: ‘దురంధర్’ కుక్క ఉపమానం
అయితే, తాజాగా దురంధర్ సినిమా సాధించిన విజయంపై షాకింగ్ పోస్ట్ పెట్టాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). దురంధర్ సినిమాను కుక్కతో పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. “ధురంధర్ లాంటి హిస్టరీ క్రియేట్ చేసే సినిమాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ వారు దాన్ని పట్టించుకోనట్టుగా నటిస్తారు. కారణం ఏంటంటే, ఆ సినిమా స్థాయిని అందుకోలేమని భయం వాళ్లకి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ కుక్క ఉంది అనుకోండి. ఆ యాజామాని ఆ కుక్క కరవదు అని చెప్పినా కూడా మనలో ఆ భయం ఉంటూనే ఉంటుంది. దానిని అలా కళ్ళ చివర నుంచి భయంభయంగా చూస్తాం.
ఇండస్ట్రీలో ‘దురంధర్’ భయం: వర్మ విశ్లేషణ
అదేవిదంగా ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాలో ఆఫీసులో ‘ధురంధర్’ అనే సినిమా భయపెట్టే కుక్కలా తిరుగుతోంది. ఆ పేరు ఎత్తడానికి కూడా మేకర్స్ భయపడుతున్నారు. భారీ సెట్లు, విఎఫ్ఎక్స్, హీరో ఎలివేషన్ నే నమ్ముకుని సినిమాలు చేసే మేకర్స్ కి ‘ధురంధర్’ ఒక హారర్ సినిమా లాంటిది. దర్శకుడు ఆదిత్య ధర్ చేసిన ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, గత 50 ఏళ్లలో ఎక్కువమంచి మాట్లాడుకున్న సినిమాగా నిలిచిందని”రాసుకొచ్చాడు వర్మ. దీంతో వర్మ చేసిన ఈ సంచనల పోస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘దురంధర్’ విజయం, దానిపై వర్మ విశ్లేషణ బాలీవుడ్‌లో కొత్త ఒరవడికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఇది ఇతర మేకర్స్‌కు ఒక పాఠంగా నిలిచింది.

