|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Duvvada Srinivas : మాధురికి వచ్చే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏం చేస్తానంటే.. దువ్వాడ కామెంట్స్..

Published: 13-10-2025, 11:40 PM
Duvvada Srinivas : మాధురికి వచ్చే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏం చేస్తానంటే.. దువ్వాడ కామెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 9లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో అడుగుపెట్టారు. ఆమె ప్రైజ్ మనీపై దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాధురి గెలిస్తే వచ్చే మొత్తాన్ని పేదలకు, వికలాంగులకు, క్యాన్సర్ బాధితులకు ఉపయోగిస్తామని దువ్వాడ ప్రకటించారు. ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

బిగ్ బాస్ సీజన్ 9లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది.

2

మాధురిని దువ్వాడ శ్రీనివాస్ ఎంకరేజ్ చేస్తూ బయట ఆమెను ప్రమోట్ చేస్తున్నారు.

4

మాకు భగవంతుడు ఇచ్చినది చాలు, ఈ డబ్బును సేవా కార్యక్రమాల్లో కలుపుతామని దువ్వాడ అన్నారు.

బిగ్ బాస్ 9లో దివ్వెల మాధురి ప్రయాణం

Duvvada Srinivas : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు దువ్వాడ శ్రీనివాస్ పక్కన తిరుగుతూ మాధురి బాగా వైరల్ అయింది. బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో దువ్వాడ కూడా మాధురిని ఎంకరేజ్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఆడుతుంటే దువ్వాడ శ్రీనివాస్ బయట ఆమెని ప్రమోట్ చేస్తున్నారు.(Duvvada Srinivas)

ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దివ్వెల మాధురి ఒకవేళ బిగ్ బాస్ గెలిస్తే వచ్చే డబ్బులను ఏం చేస్తారు అని అడిగారు.

ప్రైజ్ మనీపై దువ్వాడ శ్రీనివాస్ ఉదార నిర్ణయం

దీనికి దువ్వాడ శ్రీనివాస్ సమాధానమిస్తూ.. బిగ్ బాస్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీని వికలాంగులకు, క్యాన్సర్ వచ్చిన వాళ్లకు, పేద ప్రజలకు ఉపయోగిస్తాం. మాకు ఎందుకు ఈ డబ్బులు. మాకు భగవంతుడు ఇచ్చింది చాలు. మేము చేసే సర్వీస్ లో ఈ డబ్బులు కూడా కలిపి చేస్తాము అని అన్నారు.

సేవా కార్యక్రమాలపై దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తి

బిగ్ బాస్ ప్రైజ్ మనీని సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తానన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రకటన అందరినీ ఆకట్టుకుంది. మాధురి విజయం సాధిస్తే, ఆ డబ్బుతో ఎంతో మందికి సహాయం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదాత్తమైన నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.