|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింహం, ధనుస్సు, తులా రాశులు: నిజాయితీకి నిదర్శనం

Published: 22-08-2025, 4:20 AM
సింహం, ధనుస్సు, తులా రాశులు: నిజాయితీకి నిదర్శనం

జ్యోతిష్యం ప్రకారం, కొన్ని రాశుల వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. ఈ కథనంలో సింహం, ధనుస్సు, తులా రాశుల నిజాయితీ గురించి తెలుసుకుందాం.

Key Points

1

సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలతో నిజాయితీపరులు.

2

ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ప్రేమించి సత్యం మాట్లాడతారు.

4

ఈ మూడు రాశుల వారు అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు.

సింహ రాశి: నిజాయితీ మరియు నాయకత్వం

రాశుల ఆధారంగా చాలా విషయాలు చెప్పొచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. ఒక మనిషి జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా మరొకరితో భిన్నంగా ఉంటారు. ఆలోచన విధానం కానీ, ప్రవర్తన కానీ మరొకరితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

ఈ రాశుల వారు మాత్రం నిజాయితీగా ఉంటారు. పొరపాటున కూడా ఈ రాశుల వారు అబద్ధం చెప్పరు. ఎప్పుడు ఎవరిని మోసం చేయరు. పైగా మనసులో ఒక మాట, బయటకు ఒకటి ఉండదు. మరి ఆ రాశుల వారు ఎవరు? ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

ఈ మూడు రాశుల వారు పూర్తి నిజాయితీతో ఉంటారు.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పరు:

ధనుస్సు రాశి: సత్యం మరియు స్వేచ్ఛ

సింహ రాశి వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. పైగా సింహ రాశి వారు నిజాయితీపరులు. మనసులో ఏముందో వెంటనే బయటకు చెప్పేస్తారు. లోపల ఒకటి, బయటకు ఒకటి ఎప్పుడూ ఉండదు.

ఇతరుల గురించి రహస్యాలు చెప్పడం, పుకార్లు సృష్టించడం వంటివి ఈ రాశి వారికి ఏ మాత్రం నచ్చవు. అబద్ధాలు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. మోసం చేయాలని ఎప్పుడూ వీరికి కలగదు.

ధనుస్సు రాశి వారు సత్యమే మాట్లాడతారు. ఈ రాశికి అధిపతి గురువు. మనసులో ఏమనుకుంటారో దానిని బయటకు భయం లేకుండా చెబుతారు. నిజాయితీగా ఉంటారు. అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా అబద్ధాలు చెప్తే సహించలేరు. ఎక్కువగా ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ఇష్టపడతారు. అబద్ధం స్వేచ్ఛను హరిస్తుందని గట్టిగా నమ్ముతారు. అందుకే సత్యాన్ని మాట్లాడుతారు.

తులా రాశి: సమతుల్యత మరియు కరుణ

తులా రాశికి అధిపతి శుక్రుడు . తులా రాశి వారు నిజాయితీగా ఉంటారు. అబద్ధాలు చెప్పడం, వినడం రెండూ నచ్చవు. ఇతరులతో నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు. తులా రాశి వారికి కరుణ కూడా ఎక్కువ. ఇతరులను ఎప్పుడూ బాధ పెట్టరు. సత్యాన్ని దాచడానికి బదులుగా బయటకు చెప్పేస్తారు. సంబంధాల్లో సమతుల్యతను కాపాడుకోవాలని అనుకుంటారు. అందుకే ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ మూడు రాశుల వారు నిజాయితీకి ప్రతీకలు. వారి నమ్మకం, ప్రాణమైన సత్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అయితే, ఇవి సూచనలు మాత్రమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.