|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ వారం రాశి ఫలాలు (జూన్ 1-7, 2025): 12 రాశుల వార ఫలాలు, ప్రమోషన్లు, ఆకస్మిక ధన లాభం!

Published: 31-05-2025, 5:44 PM
ఈ వారం రాశి ఫలాలు (జూన్ 1-7, 2025): 12 రాశుల వార ఫలాలు, ప్రమోషన్లు, ఆకస్మిక ధన లాభం!

జూన్ 1 నుండి 7, 2025 వరకు 12 రాశుల వారఫలాలు. ఈ వారం ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్యంపై ప్రభావం, ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు.

Key Points

1

ఈ వారం రాశిఫలాల ప్రకారం, కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు.

2

ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

4

విద్యార్థులకు అనుకూలమైన సమయం, గణితం, ఆర్థికశాస్త్రం విద్యార్థులకు ప్రత్యేకంగా శుభకరమైన సమయం.

మీ రాశికి ఈ వారం ఎలా ఉంటుంది?

రాశిఫలాలు (వారఫలాలు) 01.06.2025 నుంచి 07.06.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: జ్యేష్ట మాసం, తిథి : శు. షష్టి నుంచి శు. ద్వాదశి వరకు

ఈ వారం ఈ రాశి వారికి ప్రారంభం ఆశించిన ఆర్థిక, వృత్తి విషయాల్లో వృద్ధి ఉన్నప్పటికీ అది వేగం పత్తిడితో కూడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తల్లి ఆరోగ్యం, గ్రామీణ వ్యవసాయం, విద్యార్థులకు ప్రాథమిక విద్య, స్థిరాస్తుల సంబంధ అంశాలు ఆలోచనకు వస్తాయి. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్త. వారమధ్యంలో ఆర్థిక విషయాలు అనుకూలం. జీవిత భాగస్వామికి షాపింగ్, బహుమానాల కోసం ఖర్చులు, వారికి దూరప్రదేశాల్లో వృత్తి అవకాశాలు, బాధ్యతలు పెరుగుతాయి.

కుటుంబంలో బంధువుల రాక, వారితో కొంత వినోదాత్మక సమయం గడుపుతారు. మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. విద్యార్థులకు అనుకూలం. ముఖ్యంగా వ్రాత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతుంది. గణితం, చార్టెడ్ అకౌంటెన్సీ, ఆర్థికశాస్త్ర విద్యార్థులకు అనుకూలం.

వృషభ రాశి వారికి వారాంతంలో దగ్గర ప్రయాణాలు, వత్తిడి, తోబుట్టువులతో ఆకస్మిక ఘర్షణలు. పెట్టుబడుల విషయాలలో కొత్త వారిని నమ్మేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఆత్మీయుల కోసం ఖర్చులు చేస్తారు. స్వార్థంగా ఆలోచించకుండా సహకారం చేస్తే అపార్థాలు ఉండవు, తద్వారా గౌరవం పెరుగుతుంది. వారమధ్యంలో ఆలోచనలు బాగుంటాయి.

ఆర్థిక విషయాల్లో, కుటుంబ-స్థిరాస్తుల విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి బాగుంటుంది. ఋణాలు తీరుస్తారు. కొత్త గవర్నమెంట్ ఋణాలకు ప్రయత్నాలు, ఆలస్యమైన పనులు ముందుకు వెళతాయి. చమత్కారంగా మాట్లాడి పనులు సాధిస్తారు. విద్యార్థులకు అభివృద్ధి. ప్రియమైన వారితో అనుకూలం, గొడవలు సమసిపోతాయి. వారాంతంలో వారసత్వపు ఆస్తుల చర్చలు, తోబుట్టువులతో దగ్గర ప్రయాణాలు.

మిథున రాశి వారికి వారము ప్రారంభంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మాటలు ఇతరులు స్వార్థంగా భావించటం వల్ల విభేదాలు వచ్చే అవకాశముంది, కాబట్టి జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. సమయానికి ధనం చేకూరడంలో కొంత ఆటంకం, అనుకోని దగ్గర ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉన్న తోబుట్టువులు సంతానం విద్య, వృత్తి అభివృద్ధికి సహకరిస్తారు.

మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వారాంతంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తిలో శ్రమ ఉన్నా అభివృద్ధి ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారం ప్రారంభించడానికి ఆత్మీయులను సంప్రదిస్తారు.

ఈ వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధి కోసం శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ఘర్షణతో కూడిన ఆలోచనలు ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి అవసరం. నిర్లక్ష్యం వద్దు.

ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు

వారమధ్యలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పనులు కొంతవరకు ముందుకు వెళతాయి. గృహ, వాహన, ఆర్థిక విషయాలలో కదలికలు కొంత ఆశ కలిగిస్తాయి. ఖర్చు అధికంగా ఉంటుంది. నూతన వృత్తికి ప్రయత్నాలు. గౌరవం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల గురించి ఆలోచనలు, క్షేత్ర సందర్శన, రోగనిరోధక శక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తారు.

సింహ రాశి వారు ఈ వారం ప్రారంభంలో తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, దూర ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి మరణ, ఖర్చు, శ్రమతో కూడిన అవకాశాలు. వృత్తిపరమైన ప్రయాణాలు, వృత్తిపరమైన గౌరవం, అభివృద్ధికరమైన అవకాశాలు, ప్రమోషన్లు, మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి బహుమానాలు. స్వయంగా బిజినెస్ చేసుకునే వారికి, ముఖ్యంగా స్త్రీలకు బ్యూటీ క్లినిక్, వస్త్రాలు మొదలైన రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో అనుకూలం. సంతానానికి విద్యాసం, బంధ అంశాల్లో జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. లాభదాయకంగా ఉన్నప్పటికీ, వారి అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరంగా మంచి ఆలోచనలు వస్తాయి. తల్లిదండ్రుల కొరకు వారి సౌకర్యాల కొరకు గౌరవం పెరుగుతుంది.

కన్యా రాశి వారు వారం ప్రారంభంలో ముఖ్యమైన విషయాల్లో కొన్ని వాయిదాలు వేస్తారు. రావాల్సిన ఆర్థిక అంశాలు, ప్రయాణాలు, ఎదురుచూసే మంచి విషయాలు వాయిదాల వల్ల చికాకులు. రీసెర్చ్ విద్యార్థులకు అనుకూలం. భూ సంబంధ పెట్టుబడుల విషయంలో తోబుట్టువులు, మిత్రులను సంప్రదిస్తారు. వరం మధ్యలో కొంత అసంతృప్తి, పెద్దల సహకారం, ఆర్థిక అంశాల్లో మాట సహాయములో ఆలస్యం. స్త్రీలతో, ఉన్నత స్థాయి రాజకీయ పలుకుబడి వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

నిదానంగా ముందుకు వెళ్ళాలి. వారపు చివరిలో తల్లి, భాగస్వామితో సంప్రదింపులు, స్థిరాస్తులపై పెట్టుబడి కోసం నిర్ణయాలు. భాగస్వామికి వృత్తిలో శ్రమ, గౌరవం. కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం, ఎదురుచూసిన వర్తమానాలు అందుకుంటారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులను నమ్మేటప్పుడు జాగ్రత్త.

వారపు ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలిసి వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. వృత్తిలో ఆటంకాలు, స్వార్థపూరిత వ్యక్తుల వల్ల గౌరవం తగ్గుతుంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక లాభాలు రావాల్సిన చోట రహస్య శత్రువుల వల్ల వాయిదాలు, విభేదాలకు కొంత అవకాశం. ముఖ్యంగా మీ వ్యాపారంలో ప్రత్యర్థుల వల్ల, అలాగే స్త్రీల వల్ల ఘర్షణలకు అవకాశాలు ఉన్నందున ఎవరితోనూ వైరము రాకుండా, మాటల విషయంలో జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త అవసరం. సహకారంతో, తెలివితేటలతో, పెద్దల ఆశీస్సులతో శత్రువులను జయిస్తారు. వారాంతంలో వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే స్వార్థపరులను అధిగమిస్తారు.

వృశ్చిక రాశి వారు వారం ప్రారంభంలో శ్రమతో పనులు ప్రారంభిస్తారు. ముఖ్యంగా గృహ సంబంధ అంశాలు, మీ వ్యక్తిగత దైనందిన, వృత్తి విషయాల్లో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. దీంతో అసంతృప్తి అధికమవుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వారం మధ్యలో వృత్తిలో గౌరవం, బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి అధికారులతో విభేదాలు, నూతన పరిచయాలు, వారసత్వపు ఆస్తులపై ఘర్షణ, తండ్రి తరపు పెద్దలతో చర్చలు, పనుల్లో జాప్యం. భాగస్వామితో కొత్త ప్రదేశాలకు వెళతారు.

ప్రశాంతతకు, కుటుంబంతో విందు, ఆధ్యాత్మిక ప్రదేశాలు. సంతాన అభివృద్ధికి వారి విద్య, వస్తువులకు ఖర్చులు అధికం. అయితే ఆ విషయాల్లో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త అవసరం. సంతానం, ప్రియమైన వారితో, విదేశాల్లో ఉండే సంతానంతో చర్చలు. వారాంతంలో దూర ప్రయాణాలు, ఉన్నత విద్యకై ప్రణాళికలు.

ఆరోగ్యం, కుటుంబం, విద్యార్థులకు సూచనలు

వారం ప్రారంభంలో ఆలోచనలు బాగుంటాయి. ఆకస్మిక ఖర్చులు – సంతానం, విద్య, ఆరోగ్యానికి సంబంధించి – దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆలోచిస్తారు. సంతానంతో, ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు స్వార్థరహితంగా ఆలోచిస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయి. పనులు ముందుకు వెళతాయి. వారపు మధ్యలో శ్రమ అధికం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులు, వ్యాపారస్తులు సహకరిస్తారు. ఋణాలు అందుతాయి.

స్త్రీలతో మాట పట్టింపులు, విభేదాలకు అవకాశాలు ఉన్నందున వీలైనంత జాగ్రత్త అవసరం. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ. భాగస్వామితో మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. వారి ఆరోగ్యానికి, వారి కుటుంబసభ్యులకై ఆకస్మిక ఖర్చులు సంభవిస్తాయి. సమయానికి ధనం అందుతుంది. వారాంతంలో అనవసర ఘర్షణలు, చికాకులు, ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.

ఈ వారం మకర రాశి వారికి ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలిసి గృహానికి, వాహనానికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తులు, పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వాతావరణం ఘర్షణగా ఉంటుంది. నిర్ణయ లోపాలతో కొన్ని సందర్భాల్లో వారపు మధ్యలో సంతాన విషయములో, వారి అభివృద్ధి, భవిష్యత్తు విషయాల్లో భాగస్వామితో కలిసి సృజనాత్మక నిర్ణయాలతో ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు.

కానీ సంతాన ఆలోచనలు, వారి స్వంత నిర్ణయాలు ముఖ్యంగా ఉన్నత విద్య, విదేశీ వృత్తి సంబంధ విషయాల్లో మీ ఆలోచనలకు కొంత వ్యతిరేకతలు, చికాకులు కలిగించే అవకాశమున్నా నెమ్మదిగా సద్దుకుంటాయి. తోబుట్టువులతో సంప్రదిస్తారు. ముఖ్యంగా దూరప్రాంతాల్లో ఉన్న వారితో సుదీర్ఘ చర్చలు. శత్రువులు ఇబ్బందిపెట్టే ప్రయత్నాలను మీ నైపుణ్యంతో అధిగమిస్తారు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు.

కుంభ రాశి వారికి వారం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. శ్రమతో పనులు సాధిస్తారు. గృహ వాతావరణం, విద్యార్థులకు ప్రశాంతత లేకపోవడం, పెద్దలకు కొంత అసౌకర్యం ఉండే సూచనలు. తల్లి తరపు బంధువుల రాకపోకలు. వారం మధ్యలో ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యమైన పనుల వాయిదా, మాట నిలబెట్టుకోవడంలో కష్టత.

కుటుంబంలో చిన్న ఫంక్షన్. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ. చిన్న విషయాల్లో సంతాన అభివృద్ధి, వారికోసం షాపింగ్‌లు, ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. వ్యాపార వృద్ధి. వారితో కలిసి సమయాన్ని సద్వినియోగం చేస్తారు. శక్తి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు, వ్యాపార విస్తరణకు మిత్రులతో సంప్రదింపులు. మంచి ఫలితాలకు దుర్గాదేవి ఆరాధన మంచిది.

మీన రాశి వారికి వారం ప్రారంభంలో ఆర్థిక విషయాల్లో కొంత అసంతృప్తి. కుటుంబంతో మాట పట్టింపులు, వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ ఆర్థిక విషయాల్లో ఉద్వేగాలు, ఎమోషన్స్ అధికం. వారపు మధ్యలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. వ్యక్తులు సహకరిస్తారు. తండ్రి, పెద్దలు, పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో పనులు సాధిస్తారు. జీవిత భాగస్వామితో నిర్ణయాలు అమలుచేస్తారు.

కమ్యూనికేషన్ బాగుంటుంది. మీపై శ్రద్ధ పెరుగుతుంది. అలంకరణ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ. నిరుద్యోగులకు నూతన అవకాశాలు. బద్దకంతో పనులను వాయిదా వేయకుండా ముందుకు వెళితే బాధలు తప్పుతాయి. వృత్తి విషయాల్లో కొత్త నిర్ణయాలు, స్వతంత్ర ఆలోచనలతో ముందుకు వెళతారు. స్వగ్రామ సందర్శనకు ఇష్టత. వారాంతంలో సంతానంతో, ప్రియమైన వారితో ఘర్షణలకు దూరంగా ఉండాలి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000

ఈ వారం జాగ్రత్తగా ఉండటం, సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. శుభాశీస్సులు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.