
జులై 27 నుండి ఆగస్టు 2, 2025 వరకు 12 రాశుల వార ఫలాలను తెలుసుకుందాం. ఈ వారం కొన్ని రాశులకు గౌరవం, బాధ్యతలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
Key Points
జీవిత భాగస్వామితో సామరస్యం పెంచుకోండి.
ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మేషం నుండి కర్కాటకం వరకు రాశి ఫలాలు
రాశిఫలాలు (వారఫలాలు) 27.07.2025 నుంచి 02.08. 2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: శ్రావణ మాసం, తిథి : శు.తదియ నుంచి శు. అష్టమి వరకు
మేష రాశి వారం ప్రారంభంలో ఫలితాలను గమనించగా, జీవిత భాగస్వామితో, కుటుంబములోని సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపార వ్యవహారములలో, స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాలలో ఆటంకాలు, వాగ్దానాలు నిలుపుకోవడంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు కుటుంబ వ్యవహారాల్లో చికాకులను పెంచుతాయి. వారం మధ్యలో పౌరుషం పెరుగుతుంది.
నాయకత్వ లక్షణాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. నూతన గృహ వాహనముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వారాంతంలో ఆర్థిక ఖర్చులు నియంత్రణ అవసరం. కుటుంబ స్త్రీల సహకారాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పూర్వ రుణములు చెల్లిస్తారు. సంతాన అభివృద్ధి కొరకు, ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ప్రణాళికలు. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన మంచిది.
వృషభ రాశి వారి వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త పనులు చేపడతారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి సహకరిస్తారు. మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసర ఖర్చులకు కొంతమేర నియంత్రణ సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు, రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తలు అవసరం.
బంధువర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో కులం వ్యవహారాలలో, ఆర్థిక విషయాలలో అనవసర వ్యక్తుల ప్రమేయాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించాల్సిన విధానాల్లో శ్రద్ధ తీసుకుంటారు. వారం చివరిలో నూతన వాహన కొనుగోలు, భాగస్వామికి బహుమానాల కొరకు వెచ్చిస్తారు. విద్యార్థులకు పోటీతత్వం పెరుగుతుంది.
వారం ప్రారంభంలో ఫలితములు గమనించగా, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక ఖర్చులు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన ఆరోగ్య సంబంధిత పెట్టుబడుల విషయాలలో కొంత చికాకులు, ఉద్వేగాల దిక్కుగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. వృత్తిపరమైన ప్రయాణములు, జీవిత భాగస్వామి, వారి బంధువులతో మాట్లాడేటప్పుడు అనవసర అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం.
పౌరుషం, నాయకత్వ లక్షణాలు, ఆధిపత్య ధోరణిని విడనాడాలి. చిన్న చిన్న విషయాలకు కలహములు, అపార్థములు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం. మధ్యలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో, భాగస్వామితో అనవసర అపార్థములు తగ్గుతాయి. ప్రయాణాల సమయంలో, ముఖ్యంగా డ్రైవింగ్ సందర్భాలలో “విష్ణు గరుడ వాహన” అనే శ్లోకాన్ని పఠించడం మేలు.
కర్కాటక రాశి వారి వారం ప్రారంభంలో ఫలితాంశములకు లాభ చంద్ర సంచారముచే మంచి ఆలోచనలు, సంతానముతో అనుబంధము, అనుకూలత, సృజనాత్మకత పెరుగుతుంది. షాపింగులు, విందు వినోదాలు, మంచి ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి. ఎదురుచూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుండి అందుతాయి. ఒక వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంతానం నుండి బహుమానాలు అందుతాయి.
సింహం నుండి తులారాశి వరకు రాశి ఫలాలు
గృహ, వాహన, తల్లి ఆరోగ్యం, వ్యవసాయ సంబంధ అంశాలలో కొంత అసౌకర్యం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలి. వారం మధ్యలో అనవసర ఖర్చులు, వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వారం చివరిలో మాటలతో పనులు సాధించుకుంటారు.
సింహ రాశి వారు వారం ప్రారంభంలో నూతన గృహాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. గవర్నమెంట్‌కు సంబంధించిన పనుల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండవు. వృత్తి విషయాల్లో శ్రద్ధ అవసరం. గృహ వాతావరణం, వాహన సంబంధ విషయాలు కొంత అసౌకర్యంగా ఉండొచ్చు. గురువుల ఆశీర్వాదాలు, ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలకు అవకాశముంది.
ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. వారం చివర్లో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. వృత్తిపరంగా ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు ఇబ్బంది కలిగించవచ్చు. సంతానానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి.
కుటుంబ వ్యవహారాలలో, గృహ వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆర్థిక అంశాలలో తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు అవకాశం, బాధ్యతలు పెరుగుతాయి. సహకారం లభించి, ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.
ఎంతగానో ఎదురుచూస్తున్న విషయాలలో దూర ప్రదేశం నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక చికాకులు ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, బంధు వర్గంలో విభేదాలకు దూరంగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితాల కోసం గణేశ్ ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.
తులా రాశి వారు వారం ప్రారంభంలో ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు, మైత్రి బంధాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్వాదాలు, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. వైరాగ్యాన్ని అధిగమించాలి. వృత్తిపరమైన విషయాలలో తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది.
దైవ చింతన, సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ధనరాబడి, తండ్రి ఆరోగ్యం, ఆకస్మిక విషయాలు, కొంత ఆందోళనను, అశాంతిని కలిగిస్తాయి. నిరాశ, నిస్పృహలను అధిగమించాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. వారం చివర్లో నెట్‌వర్క్‌ను పెంపొందించుకుంటారు. ఎదురుచూస్తున్న సంతోషకరమైన వార్తలు అందుకుంటారు.
వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభంలో మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి, శత్రు, రోగ, రుణాల మీద విజయాన్ని సాధిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనులు జరగడానికి సూచనలు. ఆశించిన పనుల్లో విజయం, ఆర్థిక లాభం. ఆగుతూ వస్తున్న అనేకమైన పనులు ముందుకు వెళతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు.
మీ మీద మీకు నమ్మకం, స్థిరమైన అభిప్రాయాలు. వ్యాపార విస్తరణ, స్నేహ సంబంధాలు బలపడతాయి. నూతన పరిచయాలు, విందు వినోదాలు, భాగస్వామ్య వ్యవహారాలలో పెట్టుబడుల ఆలోచనలు. జీవిత భాగస్వామితో నూతన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు. వారం మధ్యలో ప్రయాణాల్లో చికాకులను అధిగమించాలి. ఆకస్మికంగా అనవసర ఖర్చులు, ఆరోగ్య సంబంధ విషయాలలో శ్రద్ధ అవసరం. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతాయి, మానసిక అశాంతి ఉంటుంది.
వృశ్చికం నుండి మీనం వరకు రాశి ఫలాలు
ధనస్సు రాశి వారు ప్రారంభంలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, పోటీలు అనూహ్యంగా ఎదురవుతాయి. రుణాలు చెల్లిస్తారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. సంతాన అభివృద్ధి సాధ్యం. ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
కంటి ఆరోగ్యంపై ఆహార నియమాలు పాటించాలి. ఆకస్మిక విమర్శలు, సోదర వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వం పనికిరాదు. వారం చివరలో వృత్తి సంబంధ విషయాల్లో అధిక శ్రమ అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తులతో మాటామంతి, ప్రయాణాలకు అవకాశం. నూతన వృత్తులకు ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు. గౌరవం, బాధ్యతలు పెరుగుతాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
మకర రాశి వారు వారం ప్రారంభంలో శ్రమ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తికి సంబంధించిన విషయాలు, భాగస్వామ్య వ్యవహారాలలో వ్యాపార విస్తరణ కోసం, సంతాన సంబంధ విషయాల్లో నూతన ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఆలోచనలు చేస్తారు. వారం మధ్యలో దూర ప్రయాణాలకు, ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వారికి విదేశీ అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహకారం తీసుకునేటప్పుడు వైరాగ్య ధోరణిని వదిలేయాలి.
తోబుట్టువులతో విభేదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వారం చివర్లో దూర ప్రదేశాల నుండి సమాచారం కొంత అందుతుంది. పౌరుషం పెరుగుతుంది. ఆకస్మిక విషయాలు, ముఖ్యమైన అంశాలలో ఆలస్యాలు, ఆటంకాలు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో చికాకులు, అనవసరమైన వ్యయాలు, ఆశించిన అంశాలలో శ్రమతో ఫలితాలు అందుతాయి.
వారం ప్రారంభంలో గమనించగా, విద్యార్థులు విద్యపై దృష్టిని కేటాయించాలి. గృహ, వాహన రిపేర్ల కోసం శ్రద్ధ అవసరం. స్త్రీ సంతాన అభివృద్ధి, పురుష సంతాన అలవాట్లు, అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి అవసరం. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. అసంతృప్తి అధికంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో పందేలు, బెట్టింగులకు దూరంగా ఉండాలి.
గవర్నమెంట్ పదవుల్లో ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకుల సహకారాన్ని కోరుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశీయానానికి శ్రమ చేస్తారు. వారం చివరలో పనులు కొంతవరకు ముందుకు కదులుతాయి. కుటుంబ సభ్యులు, భాగస్వామి సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారాన్ని సహకారంతో వృద్ధి చేసుకునే ఆలోచనలు. వృత్తిపరమైన విషయాల అభివృద్ధి.
మీన రాశి వారికి వారం ప్రారంభంలో ముఖ్య వ్యవహారాల్లో శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తూ ముందుకు వెళ్లడానికి కృషి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు. వృత్తిపరమైన చికాకులు, ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు ఊహించని ఇబ్బందులను పెంచుతాయి. వారం మధ్యలో డ్రైవింగ్ చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనానికి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటాయి. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది.
ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ అవసరం. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా అనవసర వ్యక్తుల జోక్యం చికాకులు సృష్టిస్తుంది. తలనొప్పి, కంటి సంబంధ అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయరాదు. ఆరోగ్య, వాహన విషయాల్లో జాగ్రత్త అవసరం. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం సత్యనారాయణ స్వామి ఆరాధన ఉత్తమం.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000


