
మే 28, 2025 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. మేష, వృషభ, మిథున రాశుల వారికి శుభవార్త! వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి రోజు. శ్రీరాముడు, విష్ణువులను ధ్యానించండి.
Key Points
మేష రాశివారు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశివారు కొత్త ఆస్తులు సంపాదించే అవకాశం ఉంది.
శ్రీరాముడు, విష్ణువులను ధ్యానించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
మేష రాశి దినఫలం
రాశిఫలాలు (దిన ఫలాలు): 28.05.2025
ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ట, వారం: బుధవారం, తిథి: శుక్ల పక్ష పాడ్యమి – విదియ, నక్షత్రం: మృగశిర
మేష రాశి వారికి కొత్త ఆశలు కలుగుతాయి. ఆర్థికంగా అనూహ్యంగా సొమ్ము అందుతుంది. ఇతరులకు సైతం చేతనైన సహాయం అందిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. కొత్త పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. వివాహయత్నాలు కలసివస్తాయి. దగ్గరి బంధువుల సహాయం అందుతుంది. చరస్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఖరీదైన ఆభరణాలు కొంటారు. ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది.
నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా గడుస్తుంది. వ్యాపారాలలో మరిన్ని లాభాలు గడిస్తారు. భాగస్వాములు మీపై మరింత నమ్మకం ఉంచుతారు. ఉద్యోగాలు అనుకున్న విధంగా సాఫీగా సాగిపోతాయి. ఎదుటి వారిని నొప్పించకుండా విధులు నిర్వహిస్తారు. రాజకీయ వేత్తలు, క్రీడాకారులు విశేష ఆదరణ లభిస్తుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృషభ రాశి వారికి కొత్త విషయాలు తెలిసి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా సొమ్ము లోటు లేకుండా గడుస్తుంది. రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు మీరే పరిష్కరించుకుంటారు. అతిథులతో ఇల్లు హడావిడిగా మారుతుంది. బంధువులు సైతం రావచ్చు. గతం నుండి ఉన్న ఆస్తులు కాపాడుకుంటూ కొత్తగా కొంత కొనుగోలు చేస్తారు. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
స్వల్ప అస్వస్థత, కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను పొందుతారు. ఒక భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు వరంగా మారనుంది. ఉద్యోగాలలో కొత్త ఆశలతో ముందుకు సాగి మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు విదేశీ పర్యటన అవకాశాలున్నాయి. విష్ణు ధ్యానం చేయండి.
ముఖ్యమైన కార్యక్రమాలు అత్యంత వేగంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. ఎటువంటి రుణబాధలు లేకుండా గడుపుతారు. పేర్లు, పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఎటువంటి ప్రయత్నాలకైనా కుటుంబ సభ్యుల సహాయం ఉంటుంది. మీరంటే మరింత ఇష్టపడతారు. పెద్దల అనుమతితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తుల కొనుగోలు, ఒప్పందాలలో సందిగ్ధత తొలగుతుంది. ఆరోగ్యం మీరు తీసుకునే జాగ్రత్తలతో కొంత మెరుగుపడి ఊరట పొందుతారు. వ్యాపారాలలో వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేసి ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అన్నింటా విజయాలే కనిపిస్తాయి. టెక్నాలజీ రంగం వారు పట్టుదలతో ప్రాజెక్టులు సాధిస్తారు.శ్రీ శివ ప్రాతఃస్మరణ స్తోత్రం పఠించండి.
కర్కాటక రాశి కొత్త కార్యక్రమాలను చేపట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అవసరాలు వచ్చినా ఇబ్బంది లేకుండా సొమ్ము సమకూరుతుంది. వివిధ మార్గాల్లో పొదుపు పాటిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ఇళ్ల కొనుగోలుపై ఒక ఒప్పందానికి వస్తారు. ఆధరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో సంస్థల
వృషభ రాశి దినఫలం
విస్తరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఉన్నతస్థాయి నుండి వచ్చిన పిలుపు ఊరట ఇస్తుంది. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు సంతోషంగా గడుపుతారు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. టెక్నాలజీ రంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. ప్రస్తుత కంపెనీ మారే అవకాశం ఉంది. దుర్గామాతకు హారతి ఇచ్చి చక్కెర నివేదించండి.
అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడేస్తుంది. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. రుణభారాల నుండి విముక్తి పొందుతారు. కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. క్షణం తీరికలేకుండా గడుపుతారు. పెద్దల నుండి సంక్రమించిన ఆస్తిలో కొంత విక్రయించి కొత్తగా కొనుగోలు చేస్తారు. ఖరీదైన కార్లు, దుస్తులు కొంటారు.
ఆరోగ్యపరంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుపై సహచరులు సైతం ఆశ్చర్యపోతారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకుంటారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కన్య రాశి వారు అనుకున్న వెంటనే కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. సోదరులు, సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అనూహ్యంగా కొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తగిన ముందస్తు జాగ్రత్తలు అవసరం.
వ్యాపారాలలో మొదట్లో కొంత నిరాశ కనిపించినా క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు సంతోషకరంగా గడుస్తుంది. టెక్నాలజీ రంగం వారికి ఒక కీలక పోస్టు రావచ్చు. నృసింహస్వామిని స్మరించండి.
తుల రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఇతరుల నుండి సైతం బాకీలు అందుకుంటారు. కుటుంబంలో అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవైపు గృహోపకరణాలు, మరోవైపు స్థిరాస్తులు కొనుగోలుకు సమాయత్తమవుతారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊపిరి పీల్చుకుంటారు.
వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. నూతన భాగస్వాములు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వీరిపై పనిభారం తగ్గవచ్చు. వైద్యులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ప్రతిభను చాటుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పూజించాల్సిన దైవం: శివాష్టకం పఠించడం మంచిది.
వృశ్చిక రాశి వారి చిరకాల స్వప్నం నెరవేరి సంతోషంగా గడుపుతారు. దైవకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరి కొన్ని అవసరాలు తీరుతాయి. ఇతరులకు బాకీపడిన మొత్తాలు చెల్లిస్తారు. కుటుంబంలో అందరి ఆదరణ పొందుతారు. ఎంతో కొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిపడతారు.
వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. భాగస్వాములు మరింత చేయూతనిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు గుర్తింపు పొందుతారు. మహిళలకు కుటుంబంలో తగినంత ఆదరణ లభిస్తుంది. టెక్నాలజీ రంగం వారికి మొదట్లో ఇబ్బంది కలిగినా క్రమేపీ అనుకూలం. దత్తాత్రేయుల వారిని పూజించండి.
మిథున రాశి దినఫలం
ధనుస్సు రాశి వారు కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడంలో శ్రమపడతారు. కానీ పట్టుదలతో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందక మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. అవసరాలు తీరక కొంత అయోమయానికి లోనవుతారు. పొదుపు మొత్తాలు సైతం వెనక్కి తీసుకుంటారు. బంధువులు మీపట్ల కొంత వ్యతిరేకత చూపుతారు.
పెద్దల నుండి సంక్రమించిన ఆస్తిలో కొంత విక్రయిస్తారు.ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యాపారాల విస్తృతికి చేసే యత్నాలకు విఘాతం కలుగవచ్చు. సంయమనం పాటించాలి. అదనపు బాధ్యతలు మీద పడి సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు వారి అంచనాలు తప్పవచ్చు. మహిళలు కుటుంబసభ్యులతో విభేదిస్తారు. శివాష్టకం పఠిస్తే ఉత్తమం.
మకర రాశి వారు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు. రుణదాతలు ఒత్తిడులు తగ్గించడంతో ఊరట చెందుతారు. పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు కుదురుతాయి. ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు అయ్యి లాభాలు అందుతాయి.
ఉద్యోగులు విధి నిర్వహణలో రాజీలేకుండా ముందుకు సాగుతారు. క్రీడాకారులు, రాజకీయవేత్తలు, వ్యవసాయదారులకు ఆశలు చిగురించి కొంత సంతోషం కలిగిస్తుంది. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. టెక్నాలజీ రంగం వారు వేరే ప్రాజెక్టులు చేపడతారు. సుబ్రహ్మణ్యాష్టకం వచనం ఉపకరిస్తుంది.
మీపై ఇంతకాలం వ్యతిరేకత చూపిన ఒకరు హఠాత్తుగా మద్దతునిస్తారు. కొత్త కాంట్రాక్టులను దక్కించుకోవడంలో సఫలమవుతారు. కొన్ని వెసులుబాట్లు కలిగి సొమ్ము అందుతుంది. పొదుపు పథకాలలోని డబ్బు సైతం అందవచ్చు. అప్పులు తీరతాయి. ఊహించని విధంగా ఆస్తులు సమకూరతాయి.
ఆరోగ్యం కొంత మెరుగుపడే సూచనలున్నాయి. సునిశ్చలంగా ఉండండి. వ్యాపారాల విస్తరణలో ఊహించని పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల సమస్యల నుండి గట్టెక్కుతారు. క్రీడాకారులు, వైద్యులు, రాజకీయవేత్తలకు పట్టింది బంగారమే. మహిళలు ఒక సంతోషకర వార్త వింటారు. టెక్నాలజీ రంగం వారి ఆశలు ఫలిస్తాయి. విష్ణు ధ్యానం మంచిది.
మీన రాశి వారికి ఈ రోజు ఒక సమాచారం ఊరటనిస్తుంది. శత్రువులు కూడా స్నేహితులుగా మారడం విశేషం. రావలసిన సొమ్ము సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. షేర్ల కొనుగోలుకు డబ్బు వెచ్చిస్తారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. అలాగే, మీ ఆలోచనలపై ఎటువంటి అభ్యంతరాలు రావు. మనసు విప్పి మీ అభిప్రాయాలు వెల్లడిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అలాగే, రియల్ ఎస్టేట్‌కు మరింత బాంధవ్యంగా ఉంటుంది.
ఆరోగ్యం గతంకంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలలో మీ కష్టం ఫలించి అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పైస్థాయి వారిని ఆకట్టుకుని విధులు చక్కబెడతారు. వైద్యులు, రాజకీయవేత్తలు, కళాకారులు విజయాలను చేజిక్కించుకుంటారు. మహిళల యత్నాలు కొలిక్కి వస్తాయి. టెక్నాలజీ రంగం వారికి అనూహ్యమైన అవకాశాలు రావచ్చు. శ్రీరాముడుని ధ్యానించండి. శుభాలు కలుగుతాయి.
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000
ఈ దినఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి. శ్రీరాముడు, విష్ణువుల ఆశీస్సులు మీకు లభించుగాక!


