|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: స్టార్ డైరెక్టర్‌పై ఈషా రెబ్బా సంచలన ఆరోపణలు! ఇంత జరిగిందా?

Published: 20-01-2026, 7:00 AM
షాకింగ్: స్టార్ డైరెక్టర్‌పై ఈషా రెబ్బా సంచలన ఆరోపణలు! ఇంత జరిగిందా?
  • ఈషా రెబ్బాకు 12 ఏళ్లుగా సరైన హిట్ లేక పోరాటం
  • రంగు తక్కువ ఉంటే అవకాశాలు రావని ఈషా కామెంట్
  • ఫోటోషూట్‌లో దర్శకుడు తన మోచేతులు నల్లగా ఉన్నాయని అన్నారని వెల్లడి
  • తల్లి చనిపోయిన 12వ రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన

ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అనుభవాల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా ఒక స్టార్ డైరెక్టర్ తన రంగు గురించి చేసిన కామెంట్స్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు.

దర్శకుడి కామెంట్స్‌తో షాకైన ఈషా రెబ్బా

Eesha Rebba:ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 12 ఏళ్లకు పైగానే అవుతున్నా.. సరైన హిట్టు లేక ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. ముఖ్యంగా అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమెకు అవకాశాలు లేకపోవడంతో అభిమానులు ఇప్పటికీ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క సినిమా అయినా బ్లాక్ బస్టర్ పడాలని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే స్కిన్ కలర్ చాలా ముఖ్యమని.. కాస్త తక్కువ కలర్ ఉన్నా ఒక్కోసారి దర్శకనిర్మాతలు నిరాకరిస్తారు అంటూ తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సరసన ‘ఓం శాంతి శాంతి’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరియర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. “నేను ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న కొత్తలో ఒక సినిమా కోసం ఫోటోషూట్ జరిగింది. అయితే ఆ సమయంలో ఒక స్టార్ డైరెక్టర్ నాతో ప్రవర్తించిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా నా ఎదుటే ఆ దర్శకుడు నా ఫోటోలను ప్రతి అంగుళం జూమ్ చేసి మరీ చూస్తూ నీ మోచేతులు నల్లగా ఉన్నాయి. నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి అంటూ మొహం మీదే అన్నాడు. కనీసం కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండు అనిపించి.. ఆయన మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఈషా రెబ్బా.

తెలుగమ్మాయిలకు అవకాశాలు కష్టమేనా?

ఇకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అవకాశాలు రావాలి అంటే పార్టీలకు వెళ్లాలని , తెలుగమ్మాయి అనే ఆలోచన పెట్టుకోకూడదని కొందరు సలహాలు ఇచ్చారని .. అయితే తన తల్లి చనిపోయిన 12వ రోజు షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు అండగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. ఇండస్ట్రీలో ఆడపిల్లకు తల్లిదండ్రులు లేకపోతే అందరూ టార్గెట్ చేస్తారని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈషా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తల్లి మరణం తర్వాత షూటింగ్‌లో పాల్గొనడంపై ఆవేదన

‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. అమితుమీ, విస్మయం వంటి చిత్రాలలో తన పాత్రకు మంచి పేరు దక్కించుకుంది. ఇకపోతే 2012లో జీవితం అందంగా ఉంది అనే చిత్రం ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇదిలా ఉండగా మరొకవైపు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఉంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. కానీ ఈ వార్తలను ఆమె ఖండించింది. ఇటువంటి రూమర్స్ ని ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఓం శాంతి శాంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈషా రెబ్బ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మొత్తానికి ఈషా రెబ్బా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసే నటీమణుల కష్టాలను ఆమె మాటలు తెలియజేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.