|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ దర్శకుడితో ఈషా రెబ్బా డేటింగ్.. పెళ్లి ఎప్పుడంటే?

Published: 13-12-2025, 5:08 AM
టాలీవుడ్ దర్శకుడితో ఈషా రెబ్బా డేటింగ్.. పెళ్లి ఎప్పుడంటే?
  • హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం.
  • వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.
  • పెద్దల అంగీకారంతో సమంతలా అధికారికంగా ప్రకటించే అవకాశం.
  • ప్రస్తుతం వీరి పెళ్లి వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుందని, అధికారిక ప్రకటన త్వరలోనే ఉండొచ్చని సమాచారం.

ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్ డేటింగ్ వార్తలు

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోతున్నారు. ఊహించని విధంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తే.. మరికొందరు మాత్రం సీక్రెట్‌గా రిలేషన్‌‌షిప్ కొనసాగిస్తూ వివాహం కూడా చేసుకుంటున్నారు. వారిపై రకరకాల గాసిప్స్ వచ్చినప్పటికీ స్పందించడం లేదు. ఇటీవల సమంత కూడా అలాగే చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడాదిపాటు డేటింగ్‌లో ఉండి.. డిసెంబర్ 1న సడెన్‌గా పెళ్లి చేసుకుని అధికారిక ప్రకటనతో షాకిచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba).. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్‌(Tarun Bhaskar)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వీరిద్దరు పేరు మార్మోగిపోతుంది. ఈ క్రమంలో తరుణ్ – ఈషా రెబ్బాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు డేట్స్ వైరల్ అయ్యాయి. ఈక్రమంలో.. తాజాగా, దీనికి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తరుణ్ భాస్కర్- ఈషా వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని సమంతలాగా అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్న జంట?

సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వార్తలు: ట్రెండ్ కొనసాగుతుందా?

ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే, వారు స్వయంగా ప్రకటించే వరకు వేచి చూడాలి. ఇది కేవలం ఒక గాసిప్ మాత్రమే కావొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.